ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ??

కూటి కొరకు కోటి విద్యలు అంటుంటారు. కానీ రాను రాను కొంతమందికి ఏ మాయ రోగం వస్తుందో తెలియడం లేదు కానీ.. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ మారుతున్న కాలానుగుణంగా ఓ పక్క స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తుంటే మరోపక్క మాత్రం కొంతమంది అందాన్ని ఆయుధంగా చేసుకొని అవయవ ప్రదర్శనతో పబ్బం గడుపుకుంటున్నారు. కట్టుకున్న భర్తకు మాత్రమే చూపించాల్సిన దేహాన్ని అంగడిలో సరుకుల్లాగా అందరికీ చూపించేస్తున్నారు. చదవడానికి, చెప్పుకోడానికి కూడా కొంచెం జుగుప్సాకారంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం.

ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అంటే ఫోటోలు చూసి 'లైక్' కొట్టి నచ్చిన వారికి షేర్ చేస్తూ మెసేజెస్, కాల్స్ చేసుకునే ప్లాట్‌ఫామ్. కానీ ఇప్పుడు అది ఒక "డిజిటల్ కిరాణా కొట్టు"గా కాదు కాదు డిజిటల్ ప్రాస్టిట్యూషన్ హబ్" గా మారిపోయిందని చర్చ నడుస్తుంది. 'సబ్‌స్క్రిప్షన్స్' అనే కొత్త ట్రెండ్ వచ్చాక, ఫాలో అవ్వడం ఒక్కటే సరిపోదు.. "కంటెంట్ చూడాలంటే కప్పం కట్టాలి" అనే రేంజ్‌కి వెళ్ళిపోయింది. నిన్నటి వరకు ఫ్రీగా చూసిన ముఖాలకే ఇప్పుడు "Exclusive" అనే ట్యాగ్ తగిలించి.. నెలకు వందల్లో వసూలు చేయడం ఒక ఫ్యాషన్ గా మారియిపోయింది.

instagram-subscriptions-posts-matter-got-heavy-trolling-on-social-media-and-vishnu-priya-actress-ne

డబ్బులు కడితే అంతా చూపిస్తారా ? ..

ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే గ్లామర్ షో చూస్తే అయ్యా బాబోయ్ అనకుండా ఉండలేం. వీళ్లు ఫ్రీ ఫీడ్‌లో పెట్టే ఫోటో ఒకటే.. పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ కోసం పెట్టే ఫోటో కూడా అదే! తేడా ఏంటంటే.. ఫ్రీ ఫోటోలో తల కనిపిస్తే, పెయిడ్ ఫోటోలో కొంచెం 'జూమ్', ఇంకొంచెం 'యాంగిల్' అంతే!. ఇలా చెప్పుకుంటే పోతే ఆ దరిద్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. నెలకి వందల్లో ఫీజు పెట్టుకొని ప్రతినెల లక్షల్లో గడిస్తున్నారు. ఉదాహరణకు ఈ అకౌంట్ గురించి చెప్పుకుంటే.. purplehalcyon అనే అకౌంట్ కి ప్రస్తుతం 27.6k సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ లెక్కన చూస్తే ఈ అమ్మడికి నెలకి కోటి రూపాయల పైనే వస్తుందని చెప్పవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే "క్లోజ్ కనెక్షన్" వస్తుందని, మన మెసేజ్‌లకి రిప్లై ఇస్తారని భ్రమపడే అమాయక భక్తులు చాలామంది ఉన్నారు. కానీ రియాలిటీలో వచ్చేవి మాత్రం కాపీ-పేస్ట్ రిప్లైలు. దీంతో అసలు ఆ ఎక్స్ క్లూజివ్ పోస్టుల్లో ఏం ఉందో.. అంత పర్సనల్ గా పోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటో అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. వేరే రాష్ట్రాల వారిని పక్కన పెడితే మన తెలుగు అమ్మాయిలు. ప్రముఖ హీరోయిన్స్ కూడా ఈ గ్లామర్ షో దందాలోకి రావడం ఒకింత షాక్ ఇస్తుంది. వారిలో ప్రముఖ తెలుగు యాంకర్ కూడా ఉండడం ఇప్పుడు చర్చకు తెరలేపింది.

instagram-subscriptions-posts-matter-got-heavy-trolling-on-social-media-and-vishnu-priya-actress-ne

యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. పోవే పోరా అనే షో ద్వారా ఆడియన్స్ కు పరిచయమైన ఈ ముద్దగుమ్మ మంచి పాపులారిటీ పొందింది. తన యాంకరింగ్, అందాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు టెలివిజన్‌లో వరుస షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. గతంలో అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోషూట్‌లతో నెట్టింట హీట్ పెంచింది. ఈమె కూడా ఈ లిస్టులోకి కొత్తగా వచ్చి అందాలను ఆరబోస్తూ పోస్టులు పెడుస్తున్నట్టు ట్విట్టర్ లో డిస్కషన్ నడుస్తోంది.

అలానే చిరుత హీరోయిన్ నేహా శర్మ, తెలుగు సోషల్ మీడియా బ్యాచ్ లలో కనిపించే sadhananaidu వంటి వారు కూడా అందాల ఆరబోతనే నమ్ముకోవడం పట్ల ట్రోలింగ్ నడుస్తోంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్లు ఫ్యాన్స్ ఎంజాయ్‌మెంట్ కోసం కాదు, వాళ్ల పేమెంట్ ఎంజాయ్ చేయడం కోసం డిజైన్ చేసినవని కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+