"బిగ్‌బాస్ 9 తెలుగు" విన్నర్‌కు ప్రైజ్‌మనీతో పాటు ఇంకా ఏం ఏం వస్తాయంటే..?

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో "బిగ్‌బాస్". ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. 9వ సీజన్‌ లో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ మెంట్ పంచింది. రేపటితో ( డిసెంబర్ 21, 2025) ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. దాదాపు 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ షోలో ప్రస్తుతం టాప్ 5 మాత్రమే మిగిలారు. దీంతో డీమాన్ పవన్, సంజన, కళ్యాణ్, తనూజ, ఇమ్మానుయేల్ లలో టైటిల్ గెలుచుకునేది ఎవరా అని జోరుగా చర్చ నడుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి తనూజ, లేదా ఇమ్మానుయేల్ విన్నర్ అవుతారని అందరూ భావించారు. అయితే కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల.. మొదటి నుంచి కూడా ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు. మధ్యలో అమ్మాయిల విషయంలో కొంచెం ట్రోలింగ్ ఎదుర్కొన్న కానీ.. మళ్లీ టాస్కులలో, బిహేవియర్ తో మళ్లీ గట్టిగానే కం బ్యాక్ ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.

interesting-details-about-bigg-boss-9-telugu-winner-prize-money

ఇక ఈ సీజన్ విన్నర్ కు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే హౌస్‌లో ఉన్న రోజులకు కంటెస్టెంట్స్‌కు రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. దీంతో మొత్తంగా విన్నర్‌కు ఈ రెండు కలిపి భారీ మొత్తమే అందుతుందని భావిస్తున్నారు. ఈ రెండిటితో పాటు విజేతకు స్పాన్సర్స్ కంపెనీల నుంచి కూడా అదనపు బహుమతులు కూడా అందనున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే కారు, ప్లాట్, బంగారు ఆభరణాలు కానుకలుగా పొందే అవకాశం ఉందని అంటున్నారు.

అంతే కాకుండా బిగ్ బాస్ గ్రాండ్‌ ఫినాలేలో మరో బంపరాఫర్ కూడా ఉండనుంది. గ్రాండ్ ఫినాలేకు ముందు బిగ్ బాస్ టైటిల్ వదులుకుని బయటకు వెళ్లే కంటెస్టెంట్స్ కి భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఇది కొన్ని సార్లు రూ.40 లక్షల వరకూ ఉంటుంది. గత సీజన్ లలో కొందరు ఈ ఆఫర్‌ను తీసుకోగా.. మరికొందరు రిజెక్ట్ చేశారు. ఈ ప్రకారం చూస్తే బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలిచానా కానీ ఫినాలేకి మిగిలిన వారిపై మాత్రం కనక వర్షం కురుస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+