ముద్దు సీన్లు చేయాలంటే.. ఆ హీరోకి పెగ్గు లేకపోతే పని అవ్వదా ..!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. తమదైన స్టైల్ లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. అయితే నటించేటప్పుడు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో తరహా అలవాటు ఉంటుంది. కొంతమందికి జనం ఎక్కువగా ఉంటే నటించడం కష్టం.. కొంతమందికి సీన్స్ ముందు రిహార్సల్స్ చేయడం అలవాటు. ఇలా ఒక్కో రీతిలో ఉండవచ్చు. కానీ ఓ నటుడికి మాత్రం రొమాంటిక్ సీన్స్ చేసే ముందు ఆ పని చేయడం అలవాటు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు ? ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
బాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్న జాకీ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ సినిమాల్లో తన మార్క్ చూపిస్తున్న జాకీ ష్రాఫ్ రియల్ లైఫ్ గురించి ఓ సీక్రెట్‌ను బయటపెట్టారు. జాకీ సినిమాల్లో బాగా కష్టమైన, ధైర్యవంతమైన పాత్రల్లో కనిపించే సీన్లు, కొందరి హీరోయిన్లతో శృంగార సన్నివేశాలు చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు అయిన మాధురి దీక్షిత్, జూహీ చావ్లా వంటి వారితో రొమాంటిక్ సీన్లు, కిస్సింగ్ సీన్లు చేసేటప్పుడు ధైర్యం కోసం బ్రాందీ తాగేవాడినని తెలిపారు. కాగా 'వర్ది' (1989) సినిమాలో మాధురి దీక్షిత్‌తో, 'ఆయినా' (1993) సినిమాలో జూహీ చావ్లాతో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా సిగ్గుపడే వారని జాకీ ష్రాఫ్ తెలిపారు. ఫ్యాన్స్ అందరూ తనని 'సెక్సీ ష్రాఫ్' అని పేరుతో పిలుస్తారని కానీ కెమెరా ముందు ఇలాంటి సన్నివేశాలు చేయడం తనకు చాలా కష్టంగా ఉందని అన్నారు.
ఈ విషయాలు ఎంత పెద్ద స్టార్ అయినా కెమెరా ముందు కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుందని అన్నారు. జాకీకి మాధురి, జూహీ చావ్లా, డింపుల్ కపాడియా లాంటి సహ నటీమణులపై చిన్నపాటి అభిమానం ఉండేదని, కానీ ఆ ఇష్టం ఎప్పుడూ హద్దులు దాటలేదని తెలిపారు. నాలుగు దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో జాకీ ష్రాఫీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన నటనతో ఎందరో అభిమానులను ఆకట్టుకున్నారు.

ఇప్పటికీ తన స్టైలింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను పెంచుకుంటున్నారు. అయితే జాకీ ష్రాఫీ ఇటీవల 'హౌస్‌ఫుల్ 5', 'తన్వి ది గ్రేట్' వంటి సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం 'వెల్‌కమ్ టు ది జంగిల్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు పట్టాలెక్కనున్నాయి. తన నటనతో బాలీవుడ్‌లో ఒక నటుడిగా ప్రస్తుతం జాకీ ష్రాఫ్ కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications