దిల్ రాజుకు శిరీష్ సొంత తమ్ముడు కాదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన పూర్తిపేరు వంశీధర్ రావు, కానీ సినిమా ఇండస్ట్రీలో అందరికి తెలిసిన పేరు మాత్రం దిల్ రాజు. దిల్ రాజు 2003లో 'దిల్' అనే చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి హిట్ అయింది. అదే సినిమా ఆయనకు 'దిల్ రాజు' అనే టైటిల్‌ను తెచ్చిపెట్టింది. డిస్ట్రిబ్యూటర్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం నేడు నిర్మాతగా, థియేటర్ ఓనర్, స్టూడియో ఓనర్ వరకు విస్తరించింది. విభిన్న కథాంశాలతో చిత్రాలను నిర్మిస్తూ టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు.

రీసెంట్ గానే ఆయన సోదరుడు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత దిల్ రాజు, శిరీష్ ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడం.. క్షమాపణలు చెప్పడం తెలిసిందే. దాంతో శిరీష్ గురించి కూడా నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అయితే ఇంతకాలం శిరీష్‌ - దిల్ రాజు సొంత అన్నదమ్ముళ్లు అని అంతా భావించారు. కానీ శిరీష్ తాను దిల్ రాజు సొంత తమ్ముడును కాదని చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.

interesting-details-about-relation-of-producers-dil-raju-and-sireesh

శిరీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దిల్ రాజు తన పెదనాన్న కుమారుడు అని అలా కజిన్ బ్రదర్ అవుతారని చెప్పుకొచ్చారు. తన తండ్రి, దిల్ రాజు తండ్రి అన్నదమ్ములు అని స్పష్టం చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా దిల్ రాజుకు ఇద్దరు సొంత అన్నదమ్ములు ఉన్నారని.. వారి పిల్లల్లో ఒకరైన హర్షిత్ రెడ్డి చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. మరొక బ్రదర్ కొడుకు థియేటర్ల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారని వెల్లడించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి దిల్ రాజు నిర్మించిన పలు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. కొన్ని ముఖ్యమైనవి..

దిల్ (2003)

ఆర్య (2004)

బొమ్మరిల్లు (2006)

పరుగు (2008)

బృందావనం (2010)

ఒక లైలా కోసం (2014)

శతమానం భవతి (2017) - ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది

ఫిదా (2017)

ఎం‌సీఏ (2017)

మహర్షి (2019)

వకీల్ సాబ్ (2021)

సామజవరగమన (2022)

ఈ సినిమాలన్నీ దిల్ రాజుకు నిర్మాతగా మంచి పేరు, గౌరవం తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆయన నిర్మించిన 'బొమ్మరిల్లు', 'ఫిదా', 'శతమానం భవతి' వంటి కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా మాత్రం వరుస డిజాస్టర్ లు ఆయనకు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన 'గేమ్ చేంజర్' ఫ్లాప్ అవ్వగా.. "సంక్రాంతికి వస్తున్నాం" మంచి హిట్ సాధించింది. అలాగే నితిన్ తో తెరకెక్కించిన 'తమ్ముడు' కూడా బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్‌ తో ఫ్లాప్ ముద్ర వేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+