బెస్ట్ ఫ్రెండ్ 'త్రివిక్రమ్' పెళ్లికి 'సునీల్' డుమ్మా కొట్టాడా.. కారణం అదే..?
రక్త సంబంధం లేకపోయినా, జీవితంలోని కష్టసుఖాలను పంచుకునే అపురూప బంధం స్నేహం. కుల, మత, వర్గ, లింగ భేదాలకు అతీతమైన ఈ అనుబంధం లోకంలో అత్యంత గొప్పదని పలువురి నమ్మకం. టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు చాలానే ఉన్నాయి. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి - కింగ్ అక్కినేని నాగార్జున.. సూపర్ స్టార్ రజనీకాంత్ - మోహన్ బాబు చెప్పొచ్చు. ఈ జనరేషన్ స్టార్ హీరోలలో మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల స్నేహం ప్రత్యేకంగా అందరినీ ఆకర్షిస్తుంది. అలానే బన్నీ- ఎన్టీఆర్, ప్రభాస్- గోపీచంద్, రానా- రామ్ చరణ్ ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. అలానే నిజమైన స్నేహానికి ఉదాహరణగా నిలిచే మరో జోడీ సునీల్ - త్రివిక్రమ్. వీరిద్దరూ కెరీర్ ప్రారంభం నుండి ఎంతో ఆత్మీయంగా ఉండేవారు.
కాలేజ్ రోజుల నుంచే..
సునీల్, త్రివిక్రమ్ ఇద్దరూ కాలేజ్ రోజుల్లోనే స్నేహితులయ్యారు. ఆ సమయంలో త్రివిక్రమ్ రచయితగా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే, సునీల్ నటుడిగా చిన్న చిన్న అవకాశాల కోసం పోరాడేవాడు. సినిమా రంగంలో స్థిరపడే వరకు ఇద్దరూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కూడా చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా.. ఆ రోజుల్లో ఒకరి దగ్గర ఉన్నది మరొకరితో పంచుకునేవాళ్లం అని చెప్పారు.

సినిమాల్లో కూడా..
త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా ఎదుగుతున్న ప్రతి దశలోనూ సునీల్ ఆయన సినిమాల్లో కీలక పాత్రలతో మెరిశాడు. నువ్వే నువ్వే, అతడు, జల్సా చిత్రాల్లో సునీల్ పాత్రలకు ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగ్‌లకు సునీల్ టైమింగ్ కలిసొచ్చి, ప్రేక్షకులకు మరపురాని సన్నివేశాలు అందాయి. ఇక రీసెంట్ గానే అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపురంలో సినిమాల్లో కూడా మెప్పించారు. కానీ వీరిద్దరూ ఒకరి పెళ్లికి మరొకరు వెళ్లలేదని తెలుసా.. అవును.. అందుకు బలమైన కారణం ఉందని కూడా తెలుస్తోంది.
కారణం అదే..?
త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు. 2002 అక్టోబర్ 11వ తేదీనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సునీల్ వివాహం 'శృతి'తో హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటల 28 నిమిషాలకు అత్యంత ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలానే అదే రోజున త్రివిక్రమ్ శ్రీనివాస్ వివాహం కూడా జరిగింది.
ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమార్తె సాయి సౌజన్యతో ఆయన పెళ్లి జరిగింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తానికి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే రోజు పెళ్లి చేసుకోవడం కూడా బాగా కలిసొచ్చిందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?











Click it and Unblock the Notifications