Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"డచ్ గులాబీ"తో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి సీక్రెట్ రివీల్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యూట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న. ఈ జంట పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. 2018లో వచ్చిన 'గీత గోవిందం', 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాల నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. అప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొనసాగుతున్నా కానీ ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి వీరు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక మీడియా వర్గాల టాక్ ప్రకారం, 2025 అక్టోబర్ 3న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. పెళ్లి కూడా నిశ్చితార్థంలాగే సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యనే జరపాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యం లోనే వీరి పెళ్లి గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

interesting-speculations-about-vijay-devarakonda-and-rashmika-marriage

అయితే వివాహానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే ఉదయపూర్ లో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయని సమాచారం. అలాగే ముంబైలో ప్రముఖ డిజైనర్ కలిసి పెళ్లి దుస్తులను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించబోతున్నారని తెలుస్తోంది. కాగా ఈ తంతులో భాగంగానే ప్రత్యేకంగా డచ్ నుంచి తెప్పించిన పూలతో అలంకరించబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

కాగా విజయ్ - రష్మిక పెళ్లికి డచ్ గులాబీలతో ప్రత్యేకంగా అలంకరించబోతున్నారట. ఈ విషయాన్ని ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రష్మిక - విజయ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జంట వివాహం వేడుక కోసం "డచ్ గులాబీ" తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

కాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్.. పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తిరుగులేని సక్సెస్ అందుకొని గీతాగోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంచెం స్లో అయ్యారు. ఈ ఏడాది కింగ్‌డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యన్ మూవీ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అలానే నేషనల్ క్రష్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది "రష్మిక మందన్నా". ప్రస్తుతం దక్షిణ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస చిత్రాలతో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+