Ira Khan : జాగింగ్ దుస్తుల్లోనే పెళ్లి తంతు ముగించిన అమీర్‌ఖాన్ అల్లుడు...
Ira Khan : జాగింగ్ దుస్తుల్లోనే పెళ్లి తంతు ముగించిన అమీర్‌ఖాన్ అల్లుడు : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేశారు. ఆమె తన ప్రియుడు ఫిట్ నెస్ కోచ్ నూపుర్ శిఖరేను బుధవారం ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి వివాహం బుధవారం గ్రాండ్‌గా జరిగింది. అయితే తన పెళ్లి తంతుకు వరుడు నూపుర్ శిఖర్ జాగింగ్ దుస్తుల్లోనే వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో బుధవారం బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే వివాహం ఎంతో వేడుకగా జరిగింది. ఈ వివాహానికి అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు ఇద్దరు కొడుకులు జునైద్ ఖాన్, ఆజాద్ ఖాన్‌లు కూడా హాజరయ్యారు. అయితే, ఈ వివాహ వేడుకకు హాజరయ్యే ముందు వరుడు నూపుర్ శిఖరే ముంబయి రోడ్లపై 8 కిలోమీటర్లు జాగింగ్ చేసి ఫైవ్ స్టార్ హోటల్‌కు చేరుకున్నారు. జాగింగ్ అనంతరం హోటల్ బయట ఉన్నతన కుటుంబ సభ్యులు, స్నేహితులతో స్టెప్పులేశారు. ఆ తర్వాత అదే జాగింగ్ డ్రస్సుతో వేదికపై వెళ్లి కుటుంబసభ్యులు, అతిథుల మధ్య కోర్టు పత్రాలపై సంతకం చేయడం చేసి, తమ పెళ్లిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ రిజిస్టర్ మ్యారేజ్‌లో ఐరాఖాన్ మాత్రం సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. వరుడు నూపుర్ శిఖరే మాత్రం జాగింగ్ దుస్తుల్లోనే పెళ్లితంతును పూర్తిచేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బనియన్, షార్ట్స్ ధరించి పెళ్లి వేదికపైకి వచ్చిన వరుడు : ఇందులో అమీర్‌ఖాన్ కూతురు ఐరా సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, నూపుర్ శిఖరే మాత్రం బనియన్, షార్ట్స్ ధరించి పెళ్లి వేదికపైకి వచ్చారు. ఈ పెళ్లి వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. పెళ్లి లాంటి శుభ సందర్భాలకు కొంచెం గౌరవం ఇవ్వండి అంటూ కొంతమంది నెటిజ్లను హితబోధన చేస్తున్నారు. అయితే మ్యారేజ్ రిజిస్టర్ అనంతరం నూపుర్ నీలిరంగు షేర్వాణీలో కనిపించారు. అయితే, జనవరి 8వ తేదీన ఈ జంట మరోసారి తమ వివాహ వేడుకను జరుపుకోనుంది. ఆ తర్వాత జనవరి 13వ తేదీన ముంబైలో గ్రాండ్‌గా వివాహ విందును ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ వివాహ వేడుకకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్-నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, బాలీవుడ్ తారలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications