'ఇరుముడి' జనరేషనల్ బ్లాక్ బస్టర్.. రూ. 200 కోట్ల పోస్టర్ తో స్పెషల్ సర్ ప్రైజ్
మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఇరుముడి' ఆగస్టు 21న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీ విడుదలై 12 రోజులు దాటినా వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సెన్సేషనల్ కలెక్షన్స్ తో విడుదలైన అన్ని చోట్లా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు రవితేజ.
ఇప్పటికే రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఇరుముడి నిలిచింది. అంతేకాక కేవలం 11 రోజుల్లోనే ఇరుముడి సినిమా రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ ను దాటేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ సర్ ప్రైజింగ్ గా ఉంది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చొని ఉండగా పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్ తో డివోషనల్ టచ్ ఇచ్చారు.
Every generation. Every theatre. One celebration. #Irumudi 💥
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2026
From kids to elders, from youth to families.... everyone celebrated #Irumudi, making it a 200 CR+ GROSS WORLDWIDE
GENERATIONAL BLOCKBUSTER 🔥
✨స్వామి శరణం✨
Go watch RAVANNA’s RAMPAGE in cinemas ❤️🔥… pic.twitter.com/bnao86ph3i
ఇరుముడి మూవీ జనరేషనల్ బ్లాక్ బస్టర్ అని చిత్ర నిర్మాతలు పోస్టు చేశారు. తాజాగా ఈ మూవీ రూ. 200 కోట్ల కొల్లగొట్టిన నేపథ్యంలో ఇలా వినూత్నంగా పోస్టర్ తో అభిమానుల్ని సర్ ప్రైజ్ చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద రవితేజ మూవీ రోజురోజుకూ రికార్డుల్ని బద్దలు కొడుతూనే ఉంది. నైజాంలో ఊహకందని లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూంది. అంతేకాక ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ టోటల్ రన్ నైజాం షేర్ ను కూడా ఇరుముడి క్రాస్ చేసింది.

అలాగే బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు రికార్డులను సైతం బద్దలు కొట్టే రేంజ్ లో బాక్సాఫీస్ విధ్వంసాన్ని సాగిస్తోంది ఇరుముడి. ఈ మూవీ రెండో శుక్రవారం బాహుబలి 2 కంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంతేకాక కొవిడ్ తర్వాత నైజాం (తెలంగాణ)లో అత్యధిక ఫుట్ ఫాల్స్ నమోదైన చిత్రంగానూ ఇరుముడి రికార్డు నెలకొల్పినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మున్ముందు ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని నమోదు చేస్తుందో చూడాలి. ఇక ఇరుముడి జోష్ తో ఇప్పటికే చకచకా రెండు సినిమాలకు సైన్ చేశారు రవితేజ.












Click it and Unblock the Notifications