అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనేనా..?
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. గతేడాది విక్టరీ వెంకటేశ్ తో సంక్రాంతికి వస్తున్నాం మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ ఏడాది చిరంజీవితో అదే రేంజ్ హిట్ కొట్టారు. దాంతో టాలీవుడ్ లో అనిల్ రావిపూడికి డిమాండ్ పెరిగింది.
2015 లో పటాస్ నుంచి తన ప్రస్థానం స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ 9 సినిమాలు చేశారు. పటాస్ తర్వాత వరుసగా సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఇక అనిల్ రావిపూడి నెక్ట్స్ టార్గెట్ 2027 సంక్రాంతి అని తెలుస్తోంది. మరి ఆయన తన నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తారా..? అని ఫ్యాన్స్ లో సందేహం కలుగుతోంది. ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లతో హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడిని అక్కినేని నాగార్జునతోనూ చేసి ఓ హిట్ ఇవ్వమని నాగ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నాగార్జునతో హలో బ్రదర్ లాంటి మూవీ చేస్తానని తెలిపారు. అయితే ఇది అధికారికంగా ప్రకటించలేదు.

మరోవైపు అనిల్ తన తదుపరి సినిమా విక్టరీ వెంకటేశ్ తో ఉంటుందని సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం వెంకటేష్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత 'దృశ్యం 3' సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. అయితే గతంలో పవన్ కల్యాణ్ తో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ పవన్ కల్యాణ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తారా..? అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications