హిట్ కొడితే మెగా ఫ్యామిలీతో సినిమా తీయాల్సిందే..!

చిరంజీవి సినిమా కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. అదేంటంటే, ఏ దర్శకుడు కొత్తగా, విలక్షణమైన కథాంశంతో హిట్ కొట్టినా, చిరంజీవి వెంటనే వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ రూమర్ కేవలం ఒక పుకారుగా మిగిలిపోలేదు, చిరంజీవి తన కెరీర్‌లో ఈ విధానాన్ని చాలాసార్లు ఆచరించి నిరూపించారు కూడా. ఈ వ్యూహం వెనుక చిరంజీవి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ప్రేక్షకులు కొత్త తరహా కథలు, దర్శకత్వ శైలిని ఇష్టపడుతున్నారు కాబట్టి, అలాంటి దర్శకులతో పనిచేస్తే తాను కూడా కొత్తదనాన్ని అందించి ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఆయన భావిస్తారు

వి.వి. వినాయక్ తొలి సినిమా "ఆది"తో వినాయక్ తిరుగులేని విజయం సాధించగానే, చిరంజీవి ఆయనతో "ఠాగూర్" అనే అద్భుతమైన సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇది చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Is This Chiranjeevi s Success Mantra The Star s Strategy of Teaming Up with Hit Directors

అంతకు ముందు బి. గోపాల్ బాలకృష్ణతో 'నరసింహనాయుడు' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ వెంటనే చిరంజీవి అతనితో 'ఇంద్ర' సినిమా తీయడం జరిగింది. మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా హిట్ కాగానే కొరటాల శివతో 'ఆచార్య' సినిమా, ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' హిట్ కొట్టగానే దర్శకుడు బాబీ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' సినిమాను తెరకెక్కించాడు.

అనిల్ రావిపూడి, వశిష్ట, శ్రీకాంత్ ఓదెల వీళ్లాంతా కూడా హిట్ కొట్టిన దర్శకులే. ప్రస్తుతం వీరందరూ కూడా ప్రస్తుతం చిరంజీవితో సినిమాలు చేస్తున్నారు. తాజాగా 'మిరాయ్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కార్తీక్ ఘట్టమనేని పేరు సైతం ఈ లిస్ట్‌లో వినిపిస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమాలో తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది.

ఇక "రంగస్థలం" సినిమాతో సుకుమార్ తెలుగు సినిమా దశనే మార్చివేశారు. ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవి సుకుమార్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపినట్లు చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి.తమిళ దర్శకుడు శంకర్ "జెంటిల్‌మెన్" సినిమాతో సంచలన విజయం సాధించగానే, తెలుగులో ఈ చిత్రాన్ని డబ్ చేయించి ప్రేక్షకులను మెప్పించారు.

ఆ తర్వాత శంకర్‌తో కలిసి సినిమా చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపారు. దురదృష్టవశాత్తూ, అది కార్యరూపం దాల్చలేదు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "బద్రి" సినిమా హిట్ అయిన వెంటనే, చిరంజీవి ఆయనతో "ఇంద్ర" చిత్రాన్ని చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయినప్పటికీ, పూరితో సినిమా చేయాలనే చిరంజీవి ఆసక్తి చాలా కాలం కొనసాగింది.

ఈ ఉదాహరణలు చూస్తే, చిరంజీవి హిట్ కొట్టిన దర్శకులకు అవకాశం ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ వ్యూహం ఆయనను ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంచుతుంది, ఎందుకంటే ఆయన కొత్త తరం దర్శకుల ఆలోచనలను గౌరవిస్తారని అభిమానులు విశ్వసిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+