Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరీనా కపూర్ ఎంట్రీ, హీరో ఎవరంటే ? అదే జరిగితే కేజీఎఫ్, సలార్ కు షాక్ !

చిన్నచిన్న పట్టణాల నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు కన్నడిగుల తీసిన, తీస్తున్న సినిమాలు చూస్తున్నారు. ఢిల్లీలోనే కాదు, లండన్‌లోనూ కన్నడిగుల సినిమాలు బాగా చూస్తున్నారు. ఇప్పుడు కన్నడ నటుడు యశ్ అతని 19వ సినిమా ప్రకంపనలు సృష్టించింది. టాక్సిక్ అనే టైటిల్ తో రాఖీభాయ్ యశ్ అతని కొత్త సినిమా బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో కరీనా కపూర్ స్యాండిల్ వుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నదనే వార్త హాట్ టాపిక్ అయ్యింది.

టాక్సిక్ ఫస్ట్ లుక్ చూస్తుంటే యశ్ అతని కొత్త సినిమా కోసం భారీ ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా ఇప్పటికే ఇండియన్ సినిమా రంగాన్ని కేజీఎఫ్ సినిమాలతో షేక్ చేసిన యశ్ హాలీవుడ్ వేదికగా అతని సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడ నటుడు యశ్ ప్రపంచ ఖ్యాతిని పొందడం కన్నడిగులను ఆనందపరిచింది. సోషల్ మీడియాలో యశ్ అభిమానులతో పాటు భారతీయ సినీ అభిమానులు టాక్సిక్ ఫస్ట్ లుక్ కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

It is reported that Bollywood beauty Kareena Kapoor is acting in KGF Hero Yash movie

ఇదే సమయంలో టాక్సిక్ సినిమాలోకి బాలీవుడ్ అందాలబామ కరీనా కపూర్ ఎంట్రీ ఇస్తుందనే వార్త మరింత క్రేజ్ ను పెంచింది. కరీనా కపూర్ కన్నడ సినిమాలో నటిస్తుందా ? అనే వార్త ఇప్పుడు స్యాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చెప్పండి. కరీనా కపూర్ కు 43 ఏళ్లు అయినప్పటికీ ఆమె ఇప్పటికీ చాలా యవ్వనంలో ఉన్న యువతిలా చాలా అందంగా, ముచ్చటగా కనిపిస్తోంది. బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు దేశవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు.

It is reported that Bollywood beauty Kareena Kapoor is acting in KGF Hero Yash movie

గతంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి పెద్ద హీరోలతో నటించిన కరీనా ఇప్పుడు కన్నడిగ యశ్ తో కలిసి ట్యాక్సిక్ సినిమాలో నటించడానికి సిద్దం అవుతోందని తెలుస్తోంది. కరీనా కపూర్ టీమ్ పరోక్షంగా ఇచ్చిన సమాచారం కూడా కలకలం సృష్టించింది. ఇంతకీ ఆ వార్త ఏమిటి? అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కరీనా కపూర్ చాలా సంతోషంగా యశ్ తో కలిసి నటించడానికి సిద్దం అవుతోందని తెలిసింది.

స్యాండిల్ వుడ్ సినిమాలపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కాంతార, చార్లీ, విక్రాంత్ రోనా, కబ్జా, వేదా వంటి సినిమాలతో పాటు కాటేర సినిమా జోరు బాగానే ఉంది, ఇలా ప్రతిచోటా కన్నడిగులు సంబరాలు జరుపుకుంటున్న వేళ స్యాండిల్ వుడ్ లోకి కరీనాకపూర్ ఎంట్రీ ఇస్తోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీని గురించి కరీనా కపూర్ టీమ్ చేసిన ప్రకటన చాలా సంచలనం సృష్టించింది.

కరీనా కపూర్ టీమ్ ఒక పెద్ద శుభవార్త చెప్పడానికి మేము సిద్దంగా ఉన్నామని క్లూ ఇచ్చింది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు కానీ ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయిన సమాచారం ప్రకారం ట్యాక్సిక్ సినిమాలో యశ్ తో కలిసి నటించడానికి కరీనా కపూర్ సిద్దం అవుతోందని అంటున్నారు. దీంతో కన్నడ సినిమాలో కరీనా కపూర్ ఎంట్రీ దాదాపుగా ఖాయం అయ్యిందని తెలిసింది.

సౌత్ ఇండియన్ సినిమాలకు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. వీటన్నింటి మధ్య కన్నడ సినిమా మరో రేంజ్ క్రియేట్ చేసింది. కన్నడ సినిమా రంగంలో పెరిగి ఇప్పుడు పాన్ ఇండియాను మించి పాన్ వరల్డ్ స్టార్‌గా మారడానికి సిద్ధంగా ఉన్న హీరో యశ్ కి దేశవ్యాప్తంగా అభిమానులు పుట్టుకువస్తున్నారు. భారతదేశంలో చాలా ఫేమస్ అయిన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ యశ్ తో కలిసి నటిస్తుందని అంటున్నారు.

It is reported that Bollywood beauty Kareena Kapoor is acting in KGF Hero Yash movie

అయితే గతంలో ట్యాక్సిక్ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని వార్త వినిపించింది. యశ్ తదుపరి చిత్రం టాక్సిక్ లోకి కరీనా కపూర్ ఎంట్రీ దాదాపు ఖాయమని, అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉందని స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు అంటున్నారు. అయితే యశ్ సన్నిహితులతో పాటు ట్యాక్సిక్ సినిమా యూనిట్ మాత్రం ఈ వార్తను ఖండించకపోగా త్వరలో శుభవార్త చెబుతాము వేచి చూడండి అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+