బేబీ బ్యూటీని బెడ్ రూం వీడియో పంపమన్న జబర్దస్త్ ఇమాన్యుయేల్
జబర్దస్త్ ద్వారా ఎంతో మంది జీవితాన్ని పొందారు. ఎంతో మంది స్టార్ కమెడియన్స్ గా పాపులర్ అయ్యారు. ఇటీవల ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బేబీ సినిమా హీరో వీరాజ్ అశ్విన్ ఈ షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. కమెడియన్ ఆయనను అడగరాని ప్రశ్న అడిగాడు. ఇప్పటికే కామెడీ పేరుతో చాలాసార్లు ఈ షోలో కంటెస్టెంట్లు హద్దులు దాటుతున్న సంగతి తెలిసిందే.
ఈ షోలో ఓ కమెడియన్ చేసిన పనికి విరాజ్ తో పాటు జడ్జిలు, యాంకర్ అందరూ షాక్ అయ్యారు. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఈ షోను చూసేవారు.. ఈ మధ్య కాలంలో దీన్నిచూడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులతో ఇవి ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో ఓ కమెడియన్ అందరికీ షాక్ ఇచ్చాడు.

ఈ షోలో మరో హీరో విరాజ్ అశ్విన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్ ఓ ప్రశ్న అడిగాడు. ఎలాగూ వచ్చారు కదా వైష్ణవి చైతన్య బెడ్ రూమ్ గంట వీడియో ఉందా.. అది ఉంటే ఫార్వర్డ్ చేయండి అంటూ అడిగాడు. అయితే ఏం చెప్పాలో అర్థం కాక విరాజ్ సైలెంట్ గా ఉండిపోయాడు. ఇక అక్కడే ఉన్న జడ్జిలు కుష్బూ, కృష్ణ భగవాన్ తో పాటు యాంకర్ రష్మీ కూడా షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ఇటీవల కాలంలో కామెడీకి హద్దు లేకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి. మితిమీరిన డైలాగులు వేస్తూ, చీప్ గా ఉండే ప్రశ్నలు అడుగుతూ ఆ షోకు ఉన్న పేరును దెబ్బతీస్తున్నారని నెటిజన్లు ఫైరవుతున్నారు.












Click it and Unblock the Notifications