Bigg Boss హౌస్ లోకి జబర్దస్త్ స్టార్- రచ్చ రచ్చే

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. సరికొత్త హంగులతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సారి హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు.. ఈ షోపై అంచనాలను భారీగా పెంచేస్తోన్నారు. సోషల్ మీడియా తారల నుండి వెండితెర, బుల్లితెర సెలబ్రిటీల వరకు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు. తమ టాస్క్ తో షో ను హీటెక్కించనున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో తీసుకొచ్చిన మార్పులు, ప్రయోగాలు ఈ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచాయి.

జబర్దస్త్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ నరేష్ పూర్తి జోష్‌తో ఎంట్రీ ఇచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జీ, సరికొత్త స్టైలిష్ స్వాగ్‌తో గ్రాండ్ లాంచ్ వేదికపై సందడి చేశాడు. అగ్నిపరీక్ష ద్వారా చరణ్, సృష్టి ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కామనర్స్‌ కు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ సీజన్ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టే అరుదైన అవకాశాన్ని చరణ్ దక్కించుకున్నాడు. వెండితెరపై మాయమైన నటుడు కృష్ణుడు.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యక్షం అయ్యాడు.

Jabardasth Naresh Commoner Charan and Sristi Enters the Bigg Boss House Telugu Season 10

అతనితో పాటు కామనర్ గా సృష్టి కూడా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. షో నిర్వాహకులు ప్రవేశపెట్టిన కఠినమైన అగ్నిపరీక్ష' టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారానే సృష్టి.. ఫ్రీ ఎంట్రీ టికెట్ అందుకోగలిగింది. ఈ సీజన్ లో కామనర్లను ఎంపిక చేసే బాధ్యతను యాంకర్ బిగ్ బాస్ మాజీ రన్నరప్ శ్రీముఖి చేపట్టడం మరో ప్రధాన ఆకర్షణ. హౌస్‌లోకి అడుగుపెట్టే ముందు కామనర్ల ఓర్పు, బుద్ది బలం, శారీరక సామర్థ్యాలను నిరూపించే సవాలుతో కూడిన అగ్నిపరీక్ష టాస్క్‌లను ఆమె ముందుండి నడిపించారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వైవిధ్యమైన కంటెస్టెంట్ల ప్రవేశంతో పదో సీజన్ సందడి మొదలైంది. రాబోయే వంద రోజులపాటు.. ఈ సెలబ్రిటీలు, కామనర్ల మధ్య జరిగే టాస్కులు, డిబేట్లతో ఈ సీజన్ రసవత్తరంగా మారబోతోంది. హౌస్‌లో సమీకరణాలు ఎలా మారబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి వారం కొత్త సవాళ్లతో సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులకు మాస్ ఎంటర్టైన్మెంట్ ను అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+