రజనీకాంత్‌కు షాకిచ్చిన జగన్

గత కొన్ని సంవత్సరాలుగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. ''జైలర్‌''ను మినయిస్తే.. మిగిలిన సినిమాలు ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కబాలి, కలా, దర్బార్, పెద్దన్న వంటి సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో రజినీకాంత్ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయింది.

ఇక తాజాగా రజనీకాంత్‌ నుంచి వచ్చిన ''లాల్ సలాం'' సినిమా పరిస్థితి ఇలానే ఉంది. అసలు ''లాల్ సలాం'' అనే సినిమా ఒకటి వచ్చిందనే విషయం ప్రేక్షకులకు తెలియదంటే .. రజనీకాంత్‌ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా తయ్యారైందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు రజనీకాంత్‌ నుంచి సినిమా వస్తుందంటే తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగ వాతవరణం కనిపించేది.

Jagan biopic has more collections than Rajinikanths Lal Salaam

కాని ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తి విరుద్దంగా మారిపోయింది. రజనీకాంత్‌ స్టామినా తగ్గిపోవడంతో పాటు, యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో సూపర్ స్టార్ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. తెలుగులో అయితే రజనీకాంత్‌ మార్కెట్ రోజు రోజు తగ్గిపోతుంది. ''లాల్ సలాం'' కలెక్షన్లు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.

ఏపీ సీఎం జగన్ బయోపిక్‌గా తెరకెక్కిన ''యాత్ర - 2'' సినిమా సాధించిన కలెక్షన్లను కూడా లాల్ సలాం సాధించిలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా లాల్ సలాం మొదటి రోజు రూ. 5 కోట్లు సాధించి రజనీకాంత్‌ కెరీర్‌లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా కన్నా ''యాత్ర - 2'' సినిమాకే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి.

Jagan biopic has more collections than Rajinikanths Lal Salaam

జగన్ బయోపిక్‌కు మొదటి రోజు రూ. 5.5 కోట్లు వచ్చినట్టు సమాచారం. రజనీకాంత్‌ ''లాల్ సలాం'' సినిమా కంటే జగన్ బయోపిక్‌కే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్‌కు జగన్ బయోపిక్ గట్టి షాకే ఇచ్చిందని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+