Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్న జగ్గూ భాయ్.. ఈసారి కొత్త అవతార్ !

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు జగపతి బాబు. 1989లో వచ్చిన "సింహాసనం" సినిమాతో జగపతిబాబు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1990లలో ఫ్యామిలీ ఎమోషన్లతో నిండిన పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. సీతారామయ్య గారి మనవరాలు, మావిచెట్టు, పెళ్లి, వంటి చిత్రాలు ఆయన నటుడిని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. అలానే శుభలగ్నం, శుభమస్తు, పెళ్లికానుక, అంతఃపురం వంటి సినిమాలు ఆయన కెరీర్‌ను పీక్స్ కు తీసుకెళ్లాయి.

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మరో శోభన్ బాబు అంటూ గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు.. 2014లో వచ్చిన ''లెజెండ్'' సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి
సెకండ్ ఇన్నింగ్స్‌కి బలమైన బాట వేసుకున్నారు. ఆ పాత్రలో ఆయన చూపించిన క్రూరత్వం అభిమానులనే కాదు విమర్శకులను కూడా మెప్పించింది ఆ చిత్రంతో పాటు రంగస్థలం, నాన్నకు ప్రేమతో, సైరా నరసింహారెడ్డి, సలార్, అఖండ, రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి.

jagapathi-babu-jayammu-nischayambu-raa-talk-show-promo-released

మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ నటుడు.. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా మారారు. ఇక ఇప్పుడు మరో కొత్త అవతార్ లోకి షిఫ్ట్ అవుతున్నారు జగపతి బాబు. తన అభిమానులను బుల్లితెర మీద కూడా అలరించేందుకు సిద్ధమయ్యారు జగ్గూ భాయ్.

జయమ్ము నిశ్చయమ్మురా..

జీ తెలుగు ఛానల్‌లో ప్రారంభం కాబోయే 'జయమ్ము నిశ్చయమ్మురా'' అనే టాక్ షోకు హోస్ట్‌గా జగపతిబాబు వ్యవహరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ప్రోమోలో ఆయన మాట్లాడుతూ.. జ్ఞాపకం విలువ ఒక జీవితం.. అని నేరుగా చెప్పలేకపోయినా అమ్మకి రాసిన ఉత్తరం, నాన్న కంట పడకుండా గడిపిన బాల్యం.. ఆటకోసమే బ్రతికిన రోజులు, అమ్మ నాన్న కోసమే చదువుకున్న క్షణాలు.. అలవాటుగా మారిన అల్లరి పనులు అన్నీ ఉన్న చిన్న చిన్న దొంగతనాలు...అలలా కదిలిపోయిన యవ్వనం.. కళ్ల ముందే మారిపోయిన కాలం.. వీటన్నింటికీ ఒకటే లక్ష్యం.. విజయం.. జయమ్ము నిశ్చయమ్మురా" అంటూ చెప్పుకొచ్చారు.

ఇక వీడియో చివర్లో గోడ మీద సినిమా సెలబ్రిటీల ఫోటోలు ఉండటం మనం గమనించవచ్చు. దాంతో కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారని భావిస్తున్నారు. మరి జగపతిబాబు టాక్ షో లో ఎవరెవరు పాల్గొంటారో చూడాలి.

ఇక సినిమాల పరంగా జగపతిబాబు ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+