టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగం: ఐమ్యాక్స్ 3డీ ఫార్మట్‌లో బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్
Hanuman: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ.. హనుమాన్. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. ఈ ఏడాది సంక్రాంతి రేసులో విడులయింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కలెక్షన్ల సునామీని సృష్టించింది. టాప్ హీరోలు నటించిన సినిమాలన్నింటి కంటే భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.
చిన్నసినిమాగా తెరకెక్కిన హనుమాన్ ఏ స్థాయిలో హిట్ అయిందో చెప్పడానికి ఈ లెక్కలు చాలు. తేజా సజ్జా స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టిందీ మూవీ. అంతకుముందు సోలో హీరోగా జోంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం మూవీల్లో నటించాడు తేజా. అవేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి.

దాదాపుగా రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత హనుమాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు. అమృత నాయర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ షెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రైమ్ షో పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాకు రెండో పార్ట్‌పై చిత్రీకరణ జరుపుకొంటోంది. దీనికి యూనిట్ పెట్టిన టైటిల్- జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కింద రెండో భాగం తెరకెక్కుతోంది. 2025 సంక్రాంతికి ఈ సీక్వెల్ విడుదల కానుంది. శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమాను చిత్రీకరిస్తోన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
On this auspicious #HanumanJanmotsav ,
— Prasanth Varma (@PrasanthVarma) April 23, 2024
May we all stand against all the adversities and emerge victorious 🔥
Experience the epitome of Lord #Hanuman ji‘s EPIC BATTLES in IMAX 3D💥#JaiHanuman @ThePVCU pic.twitter.com/VL94DyyPMj
ఈ మూవీపై మరో బిగ్ అప్‌డేట్ వెలువడింది. సినిమా మొత్తం కూడా ఐమ్యాక్స్ 3డీ ఫార్మట్‌లో తెరకెక్కిస్తోన్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. డ్రాగన్‌తో హనుమాన్ పోరాడుతున్నట్లుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. తెలుగుతెరపై డ్రాగన్‌ను చూడబోతున్నట్టే.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications