రజనీకి చుక్కలు చూపించే విలన్ వచ్చేశాడు.. జైలర్ 2 నుంచి ఊహించని అప్‌డేట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రజనీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని విలన్ పాత్ర, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రోల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విలన్ పాత్రలో జతిన్ సర్నా
'జైలర్' మొదటి భాగంలో వినాయకన్ తన విలక్షణ నటనతో విలన్‌గా మెప్పించగా.. సీక్వెల్‌లో అంతకు మించిన పవర్‌ఫుల్ విలన్‌ను పరిచయం చేస్తున్నారు దర్శకుడు నెల్సన్. ప్రముఖ నటుడు జతిన్ సర్నా 'జైలర్ 2'లో నెగటివ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే 'సాక్రెడ్ గేమ్స్', 'ఖాకీ: ది బీహార్ చాప్టర్' వంటి పాపులర్ వెబ్ సిరీస్‌లతో తన నటనను నిరూపించుకున్న జతిన్.. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో నేరుగా ఢీకొనబోతున్నారు. ఈ పాత్ర తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని ఆయన ఎంతో ఉత్సాహంగా వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈయన తన భాగానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Jailer 2 Update Jatin Sarna to Play Villain Bollywood star Shah Rukh Khan Cameo Shoot Details Out

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఎప్పుడు?
ఈ సినిమాలో మరో అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఓ కీలక అతిథి పాత్రలో మెరవబోతున్నారు. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ఈ వార్త ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. తాజా సమాచారం ప్రకారం, షారుఖ్ ఖాన్ తన క్యామియో రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను మార్చి నెలలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్ వంటి ఇద్దరు దిగ్గజాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జైలర్ 2 తారాగణం, విడుదల తేదీ
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజనీకాంత్, జతిన్ సర్నా, షారుఖ్ ఖాన్‌లతో పాటు మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, యోగి బాబు, శివరాజ్ కుమార్, వినాయకన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని జూన్ 2026లో పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ మొదటి భాగం సాధించిన రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+