పవన్ కల్యాణ్ చేతికి రెండు ఉంగరాలు ఎందుకో తెలుసా?

జనసేనాని పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీచేసినప్పటికీ రెండో స్థానాల్లోను ఓటమిపాలయ్యారు. ఈసారి మాత్రం కచ్చితంగా విజయం సాధించాలనే దృక్పథంతో ఉన్న పవన్ అందుకనుగుణంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. మెజారిటీ ఓటర్లు కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడంతో ఆయన విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. కాకపోతే మెజారిటీ ఎంతనేది తేలాలి అంటున్నారు. పవన్ గెలుపుమీద, వచ్చే మెజారిటీమీద భారీగా బెట్టింగ్స్ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయి.

గత కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ను గమనిస్తే చేతికి రెండు ఉంగరాలతో కనపడుతున్నారు. అందులో ఒక ఉంగరం నాగబంధంతో ఉన్నదికాగా, మరో ఉండగరం తాబేలు ఉంగరం. మనం నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, జీవితంలో అభివృద్ధికి తాబేలు ఉంగరం పెట్టుకుంటారు. అలాగే నాగబంధం అనేది మనకు వచ్చే ఆపదలు, గండాల నుంచి, పీడల నుంచి రక్షిస్తుంది. దీన్ని పవర్ స్టార్ కూడా జ్యోతిష్యాలను, శాస్త్రాలను నమ్ముతారని అర్థమవుతోంది. స్టార్ హీరో ఏదిచేస్తే అదే అనుకరించే అభిమానులు కూడా ఇక నుంచి పవన్ కల్యాణ్ లా ఈ రెండు ఉంగరాలను ధరించే అవకాశం ఉంది.

janasena chief pawan klayan hand symboloze two rings

పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కు తెలుగు సినీ పరిశ్రమలోని ముఖ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాద్వారా తమ మద్దతు తెలుపుతున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలు విడుదలైనప్పుడు ఏపీలోని థియేటర్లలో టికెట్ల రేట్లు తగ్గించి కలెక్షన్లు తక్కువ వచ్చేలా చేయడంద్వారా తన ఇమేజ్ ను, క్రేజ్ ను దెబ్బతీస్తున్నారని భావిస్తున్న పవన్ కల్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను వైసీపీ అధికారంలోకి రాకూడదనే పట్టుదలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటయ్యేందుకు ఎంతో చొరవ తీసుకున్నారు. ఆయన కోరిక నెరవేరుతుందా? లేదా? అనేది జూన్ నాలుగోతేదీన తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+