మళ్లీ ట్వీట్ చేసిన నాగబాబు! రచ్చ.. రచ్చ!

మెగా కుటుంబంలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న మనస్పర్థలన్నీ ఒక సంఘటనతో బయటపడుతున్నాయి. అదేమిటంటే.. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం.

నంద్యాల వెళ్లడానికి ముందురోజు పిఠాపురం నుంచి పోటీచేస్తున్న చిన మామయ్య పవన్ కల్యాణ్ కు మద్దతుగా బన్నీ ట్వీట్ చేశాడు. తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆయన లక్ష్యాన్ని చేరుకోవాలని అభిలషించారు. ఆ తర్వాత రోజే నంద్యాల వెళ్లి అక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు.

janasena leader nagababu once again tweet

బన్నీని ఉద్దేశించే..
తర్వాత నాగబాబు ఒక ట్వీట్ చేశారు. మనవాడై ఉండి ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనవాడైనా పరాయివాడే అవుతాడు.. పరాయివాడై ఉండి మనతో పనిచేస్తుంటే మనవాడే అవుతాడు.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కచ్చితంగా ఇది బన్నీని ఉద్దేశించే చేశాడంటూ పెద్ద చర్చ నడిచింది. తర్వాత నాగబాబు తన ట్విటర్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ అభిమానుల నుంచి తీవ్రంగా కామెంట్లు వచ్చి పడుతున్నాయి. వాటిని తట్టుకోలేక ఆయన డీయాక్టివేట్ చేశారు.

ఖాతా పునరుద్ధరణ
అయితే మళ్లీ తాజాగా తన ఖాతాను పునరుద్ధరించారు. ఒక ట్వీట్ కూడా చేశారు. నేను నా ట్వీట్ ను డిలిట్ చేశాను అని ట్వీట్ చేశారు. అంటే బన్నీని ఉద్దేశించి చేసిన ట్వీట్ డిలిట్ చేసివుంటారని, ఆయన ఉద్దేశం కూడా అదేనని నెటిజన్లు అంటున్నారు. అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నే ఆయన డిలిట్ చేశారని, దీన్నిబట్టి ఆ ట్వీట్ బన్నీని ఉద్దేశించి చేసినదే అని అర్థమవుతుందికదా అని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.

రూ.2 కోట్ల విరాళం
జనసేన పార్టీకి అల్లు అర్జున్ రూ.2 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. అది తీసుకొని కూడా నాగబాబు ఈ రచ్చ ఎందుకు చేస్తున్నారంటూ బన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏ పార్టీకి మద్దతు తెలపలేదని, తన స్నేహితుడు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం వెళ్లి కలిసి మద్దతు తెలియజేశారని, ఆ ఒక్క సంఘటనకే ఆయన వైసీపీ మనిషి కాదు.. వైసీపీ తరఫున పనిచేసినట్లు కాదని అర్థం చేసుకోవాలంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+