ఆయన చెబితేనే ఎన్టీఆర్‌తో నటించా..జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది. జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇక ఈ ఏడాది తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది జాన్వీ కపూర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచియం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన జాన్వీ కపూర్ లుక్స్ అందర్ని ఆకట్టుకున్నాయి. ఇక పాటల్లో సైతం ఎన్టీఆర్‌తో సమానంగా స్టెప్పులు వేసి అదరగొట్టింది.

అయితే జాన్వీ కపూర్ తొలుత తెలుగులో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఓ వ్యక్తి సూచనతోనే ఆమె ఎన్టీఆర్ 'దేవర'ను అంగీకరించిందని తెలుస్తోంది. 'దేవర' సినిమాలో మొదట జాన్వీ కపూర్‌కి అవకాశం వచ్చినప్పుడు ఓ వ్యక్తి సలహాలు తీసుకుందట. ఇక ఆయన ఎవరో కాదు బాలీవుడ్ దర్శకుడు.. నటుడు.. నిర్మాత.. అయినటువంటి కరణ్ జోహార్. అయితే బాలీవుడ్ మీడియా కథనాలు ప్రకారం.. జాన్వీ కపూర్ తనకి మొదట 'దేవర' సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాన్ని కరణ్ జోహార్‌కి చెప్పిందట.
ఆ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారని కరణ్ జోహార్ అడగ్గా.. ఆమె ఎన్టీఆర్ చెప్పడంతో మరో ఆలోచన లేకుండా సినిమా ఓకే చెప్పేయ్ అని జాన్వీకి సూచించడట.ఆ హీరోతో ఇండస్ట్రీలోకి అడుగు పెడితే కచ్చితంగా నువ్వు స్టార్ అయిపోయినట్టే అని భరోసా ఇచ్చారట. ఇక కరణ్ జోహార్ మాటలు విని 'దేవర' సినిమాకి జాన్వీ కపూర్ ఓకే చెప్పిందట.అంతేకాకుండా రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చిన సమయంలో కూడా ముందుగా కరణ్ జోహార్ సలహా తీసుకొని ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తోంది. సినిమాల విషయంలో కరణ్ జోహార్ సలహాలు జాన్వీ కపూర్ కెరీర్‌కు ఎంతమేర ఉపయోగపడతాయో చూడాలి.












Click it and Unblock the Notifications