బాలీవుడ్ బడా నిర్మాతకు బిగ్ షాక్ ఇచ్చిన స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్..

జాన్వీ కపూర్‌ .. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 'ధడక్' సినిమాతో సక్సెస్‌ఫుల్ డెబ్యూ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిల్లి', 'గుడ్ లక్ జెర్రీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా రీసెంట్ గానే జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన "హోమ్ బౌండ్" సినిమా రిలీజ్ అయ్యింది.

నీరజ్ ఘైవాన్ దర్శకత్ వహించిన ఈ చిత్రం.. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించే ఇద్దరు నిరుపేద ఉత్తర భారతీయ స్నేహితుల కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సాధించింది. అలానే టాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.

janhvi-kapoor-big-shock-to-bollywood-producer-karan-johar-by-out-from-dharma-production-talent-manag

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది. కాగా ఈ అమ్మడు ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపైనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని బడా నిర్మాతకు బిగ్ షాక్ ఇచ్చింది ఈ స్టార్ బ్యూటీ.

ఏం జరిగిందంటే..

లేటెస్ట్ గా జాన్వీ కపూర్ తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు ఆమె షాకిచ్చింది. ఆయనకు చెందిన "ధర్మా ప్రొడక్షన్స్" టాలెంట్ మేనేజ్‌మెంట్ నుంచి బయటకు వచ్చేసింది. 'కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్' అనే కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ విషయం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే జాన్వీ ఇన్నాళ్లూ ఏ సినిమా చేయాలి, ఏ బ్రాండ్‌కు ప్రచారం చేయాలి అనే విషయాన్ని కరణ్ జొహార్ నిర్ణయించేవారు. దాంతో ఒకరకంగా ఆమెపై 'నెపో కిడ్' అనే ముద్ర ప్రచారం అయ్యింది.ఆ విమర్శల నుంచి బయటపడటానికే జాన్వీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతోంది.

janhvi-kapoor-big-shock-to-bollywood-producer-karan-johar-by-out-from-dharma-production-talent-manag

మరోవైపు అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోయే భారీ ప్రాజెక్ట్‌లోనూ జాన్వీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మరీ తన తల్లి లానే సౌత్ లో ఈ ముద్దుగుమ్మ కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకుంటుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+