జాన్వీ కపూర్‌తో బూతు సీన్లు..? మీకే సాధ్యం రా బాబు
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది. జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇక ఈ ఏడాది తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది జాన్వీ కపూర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో పాటు, నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో నటించిన కొత్త సినిమాపై విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. జాన్వీ తాజాగా సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 2 తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఓ సీన్‌లో మరో నటితో అద్దం ముందు నిల్చుని ఎద అందాలు ఎవరికి బాగున్నాయి అని పోల్చుకుంటారు. ఈ సన్నివేశంలో గట్టిగా గాలి పీల్చుకుని ఇద్దరిలో ఎవరి అందచందాలు గొప్పగా ఉన్నాయని జాన్వీ, సన్యా పోల్చుకుని చూసుకుంటున్నారు. ఈ సన్నివేశంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్త్రీని అందంగా చూపించాలనే కానీ, స్త్రీల అవయవాల గురించి ఇంత దరిద్రంగా చూపించడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఈ సీన్ దర్శకుడి ఎరోటిక్ మైండ్ సెట్ నుంచి ఈ సీన్ పుట్టిందని ఫైర్ అవుతున్నారు.అసలు ఇలాంటి సీన్లు చేయాల్సిన అవసరం శ్రీదేవి కూతురికి ఏం ఉందని జాన్వీ కపూర్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అన్ని రకాల పాత్రలు చేయాల్సిందే. గ్లామర్ ప్రధాన పాత్రలు కూడా చేయక తప్పదు. అలా అని ఇలావటి బూతు సన్నివేశాల్లో నటించడం ఏంటని ఆమె అభిమానులు జాన్వీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేసింది. ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో, ఉలాజ్ సినిమాలో కూడా ఆమె శృంగారభరిత సన్నివేశాల్లో ఆమె నటించింది. కానీ.. ఎప్పుడూ ఆమెపై ఈ స్థాయిలో విమర్శలు రాలేదు. కానీ తాజాగా నటించిన సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారీ సినిమాలోని సన్నివేశంపై మాత్రం దారుణంగా విమర్శలు వస్తున్నాయి. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు కావడం, శ్రీదేవి కూతురు ఇలా తన శరీరంలోని ఒంపుసొంపులను మరొకరితో పోల్చుకుంటూ సన్నివేశం చేయడం వల్లే ఈ సన్నివేశం తీవ్ర చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications