కామెంట్రీకి రెడీ అయిన "అచ్చియమ్మ".. జాన్వీ కపూర్ అదరగొట్టేసిందిగా !!
జాన్వీ కపూర్ .. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 'ధడక్' సినిమాతో సక్సెస్‌ఫుల్ డెబ్యూ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిల్లి', 'గుడ్ లక్ జెర్రీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే టాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రంలో జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది. రీసెంట్ గానే శ్రీలంకలో ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే.

సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో జాన్వీ అచ్చియమ్మగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా క్రికెట్ కామెంటేటర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది.
రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్రేక్షకులను నిరాశ పరిచింది. దాంతో ఈ సినిమా పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో లో ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ముఖ్యంగా రామ్‌చరణ్ కొట్టే ఐకానిక్ ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. అలానే ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు.
Our #Peddi's love with a firebrand attitude 😎🔥
— Vriddhi Cinemas (@vriddhicinemas) November 1, 2025
Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/8GFjuXojyn












Click it and Unblock the Notifications