'పెద్ది' వివాదం.. సీక్రెట్ చాట్స్ లీక్ పై జాన్వీ కపూర్ సీరియస్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ రిలీజైన కేవలం 5 రోజుల్లోనే రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బుక్ మై షో , డిస్ట్రిక్ట్ యాప్స్ ప్రకారం ఈ చిత్రానికి 55 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక మున్ముందు పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

అయితే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రను గ్లామర్​ కోసమే రూపొందించారంటూ విమర్శలు వస్తున్నాయి. జాన్వీ ముద్దు సీన్​, అలాగే మరికొన్ని సన్నివేశాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్కిన్ షో సన్నివేశాలు ఈ సినిమాకు అవసరం లేకపోయానా ఎందుకు పెట్టారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరోవైపు కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ మహిళా పాత్రల చిత్రీకరణ విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇదే వివాదంపై పెద్ది మూవీ దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. ఈ మేరకు ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు. అదే సమయంలో వివాదాస్పదంగా మారిన సన్నివేశాల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.

అయితే పెద్ది మూవీ వివాదం వేళ హీరోయిన్ జాన్వీ కపూర్ కు సంబంధించిన ఒక ప్రైవేట్ చాట్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అవుతోంది. ఈ ప్రైవేట్ చాట్ లో ఆమె ఒక వ్యక్తితో మాట్లాడిన మాటలు.. ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా జాన్వీ కపూర్ ఫ్యాన్ పేజీ కీలక పోస్టు పెట్టింది. నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి ఎడిటెడ్ స్క్రీన్‌ షాట్లు, ఫేక్ కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వైరల్ చేయడం నిరాశ పరుస్తోంది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

JanhviKapoor Furious Over Leaked Secret Chats in Peddi Controversy Massive Row Erupts JanhviKapoor

మరోవైపు పెద్ది సినిమాలోని జాన్వీ కపూర్​ పాత్రపై సీనియర్ నటి జయా బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో మహిళలను భోగ వస్తువులుగా చూపించడాన్ని ఆమె ఖండించారు. ఇలాంటి ఘటనలను సెట్​ లోనే ఆపి వేయడం చాలా ముఖ్యమని అన్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+