విజయ్ తనయుడి కీలక నిర్ణయం- నాన్నతో కటీఫ్
దళపతి విజయ్.. కుటుంబ సమస్యల్లో చిక్కుకున్నారు. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం.. విడాకుల కోసం కోర్టుకెక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం అటు ఆయన పార్టీ టీవీకేను కూడా ప్రభావితం చేస్తోంది. మహిళల ఓటుబ్యాంక్ దెబ్బతినొచ్చనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. ఓ ప్రముఖ నటితో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆయన కుమారుడు జాసన్ సంజయ్ తెర మీదికి వచ్చాడు. తండ్రిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. విజయ్ కు ఉన్న దాదాపు అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుండి కూడా అన్ ఫాలో అయ్యాడనే వార్తలు ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. విజయ్ తన భార్య సంగీత స్వర్ణలింగంతో విడాకుల ప్రక్రియలో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆయనకు అనైతిక సంబంధాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం.

జాసన్ విజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లల్లో అన్ ఫాలో చేశాడని చెబుతుండగా, మరికొందరు అభిమానులు అతను ముందు నుండి కూడా తన తండ్రి పేజీని అనుసరించట్లేదని వాదిస్తున్నారు. ఈ సంఘటన విజయ్ కుటుంబంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు నిదర్శనంగా మారింది.
ఇంతకీ జాసన్ సంజయ్ ఎవరు? అనేది ట్రెండ్ అవుతోంది. జాసన్ సంజయ్ 2000 ఆగస్టు 26వ తేదీన తమిళ సూపర్‌స్టార్ విజయ్, సంగీత స్వర్ణలింగం దంపతులకు జన్మించాడు. చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ (AISC)లో పాఠశాల విద్యను పూర్తిచేశాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి, టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను పొందాడు. ఆ తరువాత లండన్‌లో స్క్రీన్ రైటింగ్ కోర్సును అభ్యసించాడు. తన రచనా నైపుణ్యాలను మెరుగుపరచుకున్నాడు.
అతనికి దివ్య సాషా అనే చెల్లెలు ఉంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగిన జాసన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. విద్యాభ్యాసం తర్వాత జాసన్ సంజయ్ అనేక లఘు చిత్రాలను రూపొందించి, వాటి ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో తన దర్శకత్వ నైపుణ్యాలను నిశ్శబ్దంగా మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం ఫీచర్ ఫిల్మ్‌ల దర్శకత్వానికి మొగ్గు చూపుతున్న జాసన్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తన అరంగేట్రం సన్నాహాలు చేస్తున్నాడు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications