భార్యతో కలిసి ఉండలేక విడాకులు ప్రకటించిన స్టార్ హీరో
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

తాజాగా తమిళనాడు స్టార్ హీరో జయం రవి విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో జయం రవికి మంచి క్రేజ్ ఉంది. జయం రవి నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుందనే పేరు సంపాదించుకున్నారు. అయితే జయం రవి వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోవాలని చూస్తున్నారని,విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు పుకార్లు వచ్చాయి
జయం రవి, అతని భార్య ఆర్తి డైవర్స్ తీసుకొని విడిపోవాలని ఫిక్స్ అయినట్లు రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పుకార్లను నిజం చేస్తూ ఈ జంట తాము విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. అధికారికంగా తాము విడిపోతున్నట్టు జయం రవి తెలిపారు. అటు జయం రవి భార్య ఆర్తి సైతం విడాకులపై కీలక ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications