పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో భార్య..ఇక విడాకులే
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల తమిళనాడు స్టార్ హీరో జయం రవి వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. జయం రవి విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోవాలని చూస్తున్నారని,విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు పుకార్లు వచ్చాయి.

తాజాగా ఈ పుకార్లను నిజం చేస్తూ జయం రవి భార్య ఆర్తి తన సోషల్ మీడియాలో పెళ్లికి ఫొటోలను డిలీట్ చేయడం జరిగింది. దీంతో జయం రవి భార్య డైవర్స్ తీసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే విడాకులపై జయం రవి ఇప్పటి వరకు స్పందించలేదు. తమిళనాడులో జయం రవికి మంచి క్రేజ్ ఉంది. జయం రవి నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుందనే పేరు సంపాదించుకున్నారు. అలాంటి జయం రవి వ్యక్తిగత జీవితంలో ఇలా జరగడం నిజంగా బాధాకరమని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. జయం రవి 14 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ ఘటనతో తెర పడినట్టే అని అంతా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications