జిగ్రా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆలియాభట్..
బాలీవుడ్ నటి అలియా భట్ ఎన్నో సినిమాల్లో నటించి అద్భుతమైన నటిగా పేరుసంపాదించుకున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ముప్పయేళ్ల ఆలియా తన కొత్త చిత్రం గురించి అభిమానులతో పంచుకున్నారు. తళ్లయిన తర్వాత కూడా సినిమాలు తీస్తూ తన సినీ కెరీర్‌లో ముందుకు సాగిపోతున్నారు. ఆలియా భట్ తనకొత్త చిత్రం జిగ్రా మోషన్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. మరి అలియా నటించిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
నిర్మాతగా మారిన ఆలియా..
అలియా భట్ నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారారు. 'డార్లింగ్స్' సక్సెస్ తర్వాత ఇప్పుడు అలియా భట్ మరో పవర్ ఫుల్ చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈసారి సినిమా OTT ప్లాట్‌ఫామ్‌లో కాకుండా థియేటర్లలో హిట్ అవుతుందనే మాటలు బీటౌన్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సినిమా ద్వారా అలియా భట్ తొలిసారిగా నిర్మాతగా కరణ్ జోహార్‌తో చేతులు కలిపింది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, అలియాస్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించాయి. అలియా భట్ 'జిగ్రా' సినిమాని నిర్మించడమే కాకుండా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కూడా కనిపించనుంది. 'జిగ్రా' విడుదల తేదీని ఫస్ట్ లుక్‌ను సోషల్‌మీడియాలోని తన ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు ఆలియా.

జిగ్రా మోషన్ పోస్టర్ విడుదలైంది..
అలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'జిగ్రా' యానిమేటెడ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలోని నటి ఫస్ట్ లుక్ రివీల్ చేయబడింది. ఈ పోస్టర్‌లో అలియా రోడ్డు మధ్యలో షర్ట్-ప్యాంట్, స్నీకర్స్ ధరించి, బ్యాగ్‌ని పట్టుకుని విచారంగా చూస్తోంది. మోషన్ పోస్టర్‌లో నటి "నన్ను చూడు. నువ్వు రాఖీ కట్టావు కదా. మీరు నా రక్షణలో ఉన్నారు. నేను మీకు ఏమీ జరగనివ్వను" అని పేర్కొంది.
ఎమోషనల్ అయిన ఆలియా..
మోషన్ పోస్టర్‌ను పంచుకుంటూ, అలియా భట్ నిర్మాతగా కరణ్ జోహార్‌తో కలిసి పని చేయడంపై తన భావాలను పంచుకున్నారు. "ధర్మ ప్రొడక్షన్స్‌లో అరంగేట్రం చేయడం నుండి వారితో కలిసి సినిమా నిర్మించడం వరకు, నేను ఎక్కడ ప్రారంభించానో అక్కడ నుండి పూర్తి సర్కిల్‌కు వచ్చినట్లు అనిపిస్తుంది" అని ఆలియా క్యాప్షన్‌లో రాసింది. ప్రతిరోజూ భిన్నంగా ఉంటుంది... ఎన్నో సవాళ్లు, ఎగ్జయిట్‌మెంట్, (కొంచెం భయానకం)... కేవలం నటుడిగానే కాదు. నిర్మాతగా కూడా మేము ఈ చిత్రానికి జీవం పోస్తున్నాము. ఈ చిత్రం మరిన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేనేంతో ఉత్సహాంగా ఉన్నాను అంటూ రాసుకొచ్చారు ఆలియా.

ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
ఆలియా భట్ చిత్రం 'జిగ్రా' 27 సెప్టెంబర్ 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి వాసన్ బాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు అలియా లుక్ మాత్రమే బయటికి వచ్చింది. మిగిలిన నటీనటులు ఎవరు కనిపిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications