'కలర్ ఫోటో’ తర్వాత ఆ స్థాయి హిట్ ..ఓటీటీలో చిన్న సినిమా సంచలనం
తెలుగు సినీ యవనికపై 'కలర్ ఫోటో' ఎలాంటి ఇంపాక్ట్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఒక చిన్న సినిమా ఆ స్థాయిలో సోషల్ మీడియాను, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది అంటే అది 'జిగ్రిస్' మాత్రమే. సంక్రాంతి బరిలో హేమాహేమీలు థియేటర్లలో పోటీ పడుతుంటే, ఓటీటీలో మాత్రం కృష్ణ బురుగుల తన విశ్వరూపం చూపిస్తున్నారు.
నంబర్ వన్ ట్రెండింగ్
సాధారణంగా ఒక సినిమా ఒక ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉండటం చూస్తుంటాం. కానీ 'జిగ్రిస్' చిత్రం రెండు మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఏకకాలంలో నంబర్ 1 ,నంబర్ 2 పొజిషన్లలో ట్రెండ్ అవుతూ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదలైనప్పటికీ, గ్లోబల్ లెవల్‌లో ఉన్న తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ సినిమా సక్సెస్‌తో హీరో కృష్ణ బురుగుల రాత్రికి రాత్రే వైరల్ మ్యాన్ అయిపోయారు.

నిమాలో ఆయన పోషించిన కార్తీక్ క్యారెక్టర్ ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ అయిపోయింది. కృష్ణ మార్కు కామెడీ డైలాగ్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.కుర్రకారు ఇప్పుడు ఆయన్ని ఓటీటీ స్టార్ అని పిలుస్తూ సోషల్ మీడియాలో కిరీటం కట్టేస్తున్నారు.కార్తీక్ పాత్రలో జీవించేశావు అన్న అంటూ డల్లాస్ నుండి గల్లీ వరకు ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రశంసలే ఆయన నటనకు నిదర్శనం. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ (ట్విట్టర్) ఎక్కడ చూసినా 'జిగ్రిస్' క్లిప్పింగ్స్, డైలాగ్స్ మారుమోగిపోతున్నాయి.
పెద్ద సినిమాల ప్రచార హోరులోనూ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ఈ సినిమా నిరూపించింది. కృష్ణ బురుగుల డైలాగ్ డెలివరీ, ఆ ఎమోషన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒక చిన్న సినిమా, ఒక సాధారణ నటుడు.. అసాధారణమైన కంటెంట్‌తో వస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి 'జిగ్రిస్' ఒక ఉదాహరణ. కృష్ణ బురుగుల కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, ఆయనను టాలీవుడ్‌లో ఒక ప్రామిసింగ్ యాక్టర్‌గా నిలబెట్టింది.












Click it and Unblock the Notifications