రూ.1,393 కోట్లు నష్టం.. సినీ ఇండస్ట్రీలోనే బిగెస్ట్ డిజాస్టర్..!
సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచే ఒక విషయం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా భాషల్లో.. ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటున్నాయి. ప్రస్తుతం కాలంలో అయితే బడ్జెట్ కూడా భారీస్థాయిలో కేటాయించి మంచి క్వాలిటీ కంటెంట్ ప్రేక్షకులకు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ స్థాయిలోనే మూవీస్ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రతి వారం థియేటర్స్‌లో ప్రేక్షకుల్ని అలరించేందుకు వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటున్నాయి.
మరికొన్ని ఓటీటీ వేదికగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ జమానా నడుస్తున్న తరుణంలో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా, పాన్ వరల్డ్ స్థాయిలో సైతం రాణిస్తున్నారు. అయితే భారీస్థాయిలో బడ్జెట్ తో తెరకెక్కించిన కొన్ని చిత్రాలు అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పలు చిత్రాలు విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసి.. థియేటర్లకు వచ్చిన తర్వాత ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి.

తెలుగు లోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో ప్రేక్షకులను నిరాశ పరిచిన సినిమాలు బోలెడు ఉన్నాయి. ప్రాంతీయ భాష చిత్రాల్లో అయితే నష్టం అంచనా వేయవచ్చు కానీ హాలీవుడ్ లో అంటే నష్టం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడం కస్టమే. అలాంటిది ఓ సినిమా కోసం ఏకంగా 250 మిలియన్ డాలర్లు (రూ.2,170 కోట్లు) ఖర్చు పెడితే.. ఆడియన్స్ మీ అలరించలేక సుమారు రూ.1,393 కోట్లు నష్టం తీసుకొచ్చింది. వినడానికి షాకింగ్ గా ఉన్నా కూడా డిజాస్టర్ లలో కూడా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఆ మూవీ. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం..
సినీ చరిత్రలోనే బిగెస్ట్ డిజాస్టర్..
జాన్ కార్టర్.. ఆండ్రూ స్టాంటన్ దర్శకత్వం వహించిన ఒఈ చిత్రం 2012 లో విడుదలైంది. టేలర్ కిచ్, లిన్న్ కాలీన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఎడ్గార్ రైస్ బరౌగ్స్ రచించిన "A Princess of Mars" అనే నవలపై ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీని డిస్నీ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
దాదాపు 250 మిలియన్ డాలర్లు (రూ.2,170 కోట్లు) ఈ చిత్రం కోసం ఖర్చు పెట్టారు. అయితే సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్దఈ మూవీ ఘోరంగా ఫెయిలైంది. దాంతో డిస్నీకి సుమారు రూ.1,393 కోట్లు నష్టం వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందుకే బడ్జెట్ కన్నా కంటెంట్ ముఖ్యం అంటూ సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications