బిగ్ షాక్ : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ స్టాప్..
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. అలానే ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్.. యంగ్ హీరో టోవినో థామస్ కూడా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. జూన్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ జోర్డాన్ కూడా వెళ్లింది. అక్కడ మూవీకి సంబంధించి అత్యంత కీలకమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్టు సమాచారం. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జోర్డాన్ లో మార్చి 6 వరకు షూటింగ్ జరగాల్సి ఉందని.. కానీ అనూహ్యంగా ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా షెడ్యూల్ ప్రకారం జోర్డాన్‌లో చిత్రీకరించాల్సిన మెయిన్ యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఫినిష్ చేసేశారట. కానీ అందుకు సంబంధించిన కొన్ని 'లింక్ సీన్స్' చిత్రీకరణలో మాత్రం అడ్డంకులు ఎదురై షూటింగ్ కి బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది.

అసలు కారణం ఇదే..
జోర్డాన్‌లో స్థానికంగా జూనియర్ ఆర్టిస్టుల కొరత, లాజిస్టిక్ ఇష్యూస్ కారణంగా మేకర్స్ తమ ప్లాన్ మార్చారని అంటున్నారు. దీంతో ఆ లింక్ సీన్లను రామోజీ ఫిల్మ్ సిటీలో లేదా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో పూర్తి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. జోర్డాన్ లో షూట్ చేసిన సీన్స్ సినిమాకి హైలెట్ గా ఉంటాయని భావిస్తున్నారు.
ఇక ఓ వైపు ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు తారక్. మరోవైపు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. బాలీవుడ్ లో ఒకప్పటి టాప్ హీరోయిన్ కాజోల్.. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. లేటస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కాజోల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తల్లిగా కనిపించనుందని అనుకుంటున్నారు.
-
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు












Click it and Unblock the Notifications