జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇక పండగే.. " దేవర 2 " రిలీజ్ అప్పుడే !!
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే "వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటించగా.. ఎన్టీఆర్ కీలక పాత్రలో మెప్పించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఏంటి అని చర్చ నడుస్తున్న తరుణంలో ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ రివీల్ అయ్యింది.
కాగా అంతకు ముందు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'దేవర'. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా మెప్పించారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ సినిమా.. 2024 సెప్టెంబర్ 27న విడుదలైంది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. అంతే కాకుండా రీసెంట్ గానే జపాన్ లో కూడా ఈ చిత్రం విడుదల చేయగా మంచి కలెక్షన్స్ సాధించింది.

కాగా ఈ మూవీ యావరేజ్ గానే ఉందని.. ఎన్టీఆర్ స్టార్డమ్ వల్లే హిట్ అయిందని విమర్శలు వస్తూనే ఉంటున్నాయి. అందుకే పార్ట్-2 ఉండకపోవచ్చని నెట్టింట జోరుగా ప్రచారం నడిచింది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా 'దేవర-2' ఉంటుందని గతంలో రెండు మూడు సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల మళ్ళీ ఎటువంటి సౌండ్ లేకపోవడంతో.. ఇక దేవర సీక్వెల్ లేనట్టే అనుకున్నారంతా. దేవర పార్ట్-2 ఉంటుందా లేదా? అనే చర్చ కొద్దిరోజులుగా జరుగుతోంది. మెజారిటీ ఆడియన్స్ తో పాటు కొందరు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఫ్యాన్స్ సైతం 'దేవర-2'ఉండకపోవచ్చనే అనుకున్నారు. ఇలాంటి సమయంలో మేకర్స్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. త్వరలోనే దేవర 2 ప్రారంభం కానున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
జనగాంలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మాత మిక్కిలినేని సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు 'దేవర-2' ఉంటుందా లేదా? ఉంటే ఎప్పుడు? అనే ప్రశ్న యాంకర్ నుంచి ఎదురైంది. అందుకు సమాధానం చెబుతూ.. "దేవర-2 మే నుంచి మొదలవుతుందని.. వచ్చే సంవత్సరం రిలీజ్ కానుందని చెప్పారు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమనులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
🚨🚨🚨🚨
— H A N U (@HanuNews) January 27, 2026
DEVARA 2 - Starts from May 2026
Release in 2027 Year
- Producer
💥💥💥💥💥💥 #Devara2 @tarak9999 pic.twitter.com/vOs2YhgbKz
మరోవైపు ఎన్టీఆర్ - ప్రశాంత్ మూవీకి 'డ్రాగన్'అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు ప్రచారం నడుస్తోంది. ఆ మూవీకి కూడా పార్ట్-2 ఉందనే మాట వినిపిస్తోంది. అలానే త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకులతోనూ ఎన్టీఆర్ సినిమాలు ఓకే చేసినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే వరుస సినిమాలతో బిజిబిజీగా ఉన్న తారక్.. ఈసారి మాత్రం సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications