బ్లాస్టింగ్ న్యూస్: ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా?
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావల్సిన సలార్2 శౌర్యాంగ పర్వం సినిమాకు సంబంధించిన పనులు వచ్చే ఏడాది జరుగుతాయనుకున్నారు. అయితే సినిమాకు అనూహ్య స్పందన రావడంతో ఈ ఏడాదే పనులు ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి సలార్2 సమయానికి ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సలార్ 2 ముందుకు రావడంతో ఎన్టీఆర్ మూవీ వెనక్కి పోయింది.
ఈ తరుణంలో అనూహ్యగా అరుదైన కాంబినేషన్ లో చిత్రం రాబోతున్నట్లు తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలియజేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా వస్తుందంటున్నారు. సలార్2 వల్ల ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన సినిమా వాయిదా పడటం, అలాగే సైఫ్ అలీఖాన్ కు గాయాలవడంవల్ల దేవర షూటింగ్ ఆలస్యం కాబోతోంది. దేవర1 చిత్రాన్ని పూర్తిచేసిన తర్వాత ఎన్టీఆర్ వార్ 2 చిత్రానికి తక్కువ కాల్షీట్లే ఇస్తున్నారు. అలాగే దేవర 2 చిత్రం ప్రారంభం కావడానికి కొరటాల శివ ఎక్కువ సమయాన్ని తీసుకునే అవకాశం ఉంది. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేయాలనే నిర్ణయాన్ని తారక్ తీసుకున్నాడంటున్నారు.

వీరిద్దరూ కలిసి అరవింద సమేత వీరరాఘవ చేశారు. ఆ తర్వాత అయినను పోయిరావలే హస్తినకు అనే సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అది నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేయాలన్నా పుష్ప2 విడుదలైన తర్వాత అతను కాస్తంత విరామం తీసుకునే అవకాశం కనపడుతోంది. దీంతో కాల్షీట్లు ఖాళీగా ఉండే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications