రాజమౌళి సెంటిమెంట్‌ను బద్ధలు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్?
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ దేవర రెండుసార్లు వాయిదాపడి ఎట్టకేలకు థియేటర్లోకి అడుగుపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పై ప్రీమియర్ షోలు వేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దేవర రూ.75 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. ఎక్కడ చూసినా అభిమానుల కోలాహలం, బాణాసంచా కాల్చడంతోపాటు విపరీతమైన రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల డీజేలు, ఊరేగింపులు, డ్యాన్స్ లతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మొదటి భాగం అదిరిపోయింది
ఈ సినిమా మొదటి భాగం అదిరిపోయిందంటున్నారు. రెండో భాగం మాత్రం యావరేజ్ గా ఉందని, కొరటాల శివ మొదటి నుంచి చెప్పినట్లుగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సినిమా చూస్తే అందరికీ విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. అలాగే అంచనాలు లేకుండా సినిమా చూస్తే బాగుందంటున్నారు. మొత్తంగా చూస్తే దేవర సినిమా హిట్ అని, ఒకసారి కచ్చితంగా చూడొచ్చని, విజువల్ ఎఫెక్ట్స్, సముద్రంలోని దృశ్యాలు మరోస్థాయిలో ఉన్నాయంటున్నారు. రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా ఆ తర్వాత సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంట్ ఉంది.

అద్భుతమైన నటనతో అలరించాడు
అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఈ సెంటిమెంట్ ను బద్దలు కొట్టాడని చెబుతున్నారు. దేవర పాత్రలో తారక్ అద్భుతమైన నటనతో అలరించాడని, అదరగొట్టాడని, సినిమాకు లాంగ్ రన్ ఉంటుందంటున్నారు. సినిమా మొత్తాన్ని తారక్ తన భుజస్కంధాలపై మోశాడని, సైఫ్ అలీఖాన్ కూడా తన అద్భుతమైన నటనతో అలరించాడని ప్రేక్షకులు అంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న సెంటిమెంట్ ను కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడంటున్నారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చాలా మంచి సినిమానే తీశాడంటున్నారు.












Click it and Unblock the Notifications