'దేవర'తో వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్2 చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఇది 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలకు ముందు తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, డ్యాన్స్, నటన, యాక్షన్ సన్నివేశాలవల్ల రూ.550 కోట్లు రాబట్టింది.

అంతర్జాతీయంగా టాప్-4లో నిలిచింది
రాజమౌళి సినిమా చేసిన తర్వాత సినిమా చేస్తే కచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ను ఈ సినిమాతో తారక్ బద్ధలు కొట్టారు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరో రికార్డును ఎన్టీఆర్ నెలకొల్పారు. దేవర ఓటీటీ హక్కులను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ప్రసారమవడం ప్రారంభమైన తర్వాత అత్యధిక వీక్షణలు దక్కించుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు భారీగా వీక్షణలు దక్కుతున్నాయి. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాల్లో దేవర ఒకటిగా నిలిచింది. ఇంగ్లిషు భాషా సినిమాలు కాకుండా ఇతర భాషా చిత్రాల్లో టాప్-4లో దేవర నిలిచి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటోంది. నెట్ ఫ్లిక్స్ కూడా ఈ సినిమాను వివిధ భాషల్లోకి తర్జుమా చేసి విడుదల చేస్తుండగా ఆయా దేశాల్లో కూడా అద్భుతమైన వీక్షణలు సొంతం చేసుకుంటోంది.

junior ntr creates world record with devara movie

స్క్రిప్ట్ లో మార్పుచేర్పులు చేస్తున్న దర్శకుడు
అంతర్జాతీయంగా ఈ సినిమా బాగా పేరు తెచ్చుకోవడంతో ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు దేవర2పై పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో పలు మార్పుచేర్పులు చేస్తున్నారు. దేవర2ను ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీతోపాటు ఆంగ్లం, ఫ్రెంచి, జపనీస్, కొరియా భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్మాతలు కల్యాణ్ రామ్, చెరుకూరి సుధాకర్ ఆలోచిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో చేసే డ్రాగన్ పూర్తయిన తర్వాత దేవర2 చేస్తారా? లేదంటే నెల్సన్ దిలీప్ కుమార్ కానీ, అట్లీ దర్శకత్వంలోకానీ తారక్ సినిమా చేసే అవకాశం ఉంది. దేవర2 స్క్రిప్ట్ అనుకున్నదానికన్నా బాగా వస్తే ముందుగా దీన్నే పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈలోగా కొరటాల శివ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది స్పష్టత లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+