బాక్సాఫీస్‌ను వణికించిన 'దేవర' ఊచకోత: డే 1 ఎన్ని కోట్లో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాలుగా సోలో హీరోగా వస్తుండటంతో అభిమానులు కళ్లు కాయలు కాచేలా దేవర సినిమా కోసం ఎదురు చూశారు. ఆ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అర్థరాత్రి ఒంటిగంట నుంచే షోలు పడ్డాయి. సరికొత్త బ్యాక్ డ్రాప్ తో నెత్తుటితో ఎరుపెక్కిన సముద్రంపై దేవర విశ్వరూపాన్ని కొరటాల ఆవిష్కరించారు. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ సినిమా విడుదలైన మొదటిరోజు ఎన్నికోట్లు రాబట్టిందో తెలుసుకుందాం.

తెలుగు నుంచే రూ.68 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా మొదటి రోజు రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. కలెక్షన్ల పరంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. దేశవ్యాప్తంగా రూ.77 కోట్లు సాధించిన ఈ సినిమాకు ఇండియాలో ఏపీ, తెలంగాణ నుంచే ఏకంగా రూ.68 కోట్లు వచ్చాయి. దేవరపై రకరకాల టాక్స్ వచ్చాయి. కొందరు ఐదుకు మూడు రేటింగ్ ఇవ్వగా మరికొందరు ఐదుకు 2.5 ఇచ్చారు. మిక్స్ డ్ టాక్ వచ్చిందని అనుకున్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో మాత్రం దేవర బీభత్సం చేశాడు. హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో 0.3 కోట్ల రూపాయలు, తమిళంలో రూ.0.8 కోట్లు, మళయాళంలో రూ.0.3 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

junior ntr devara movie 1st day world wide box office collection 140 crore rupees

ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్, కొరటాల
దేవర సినిమాను ఆదరిస్తున్నందుకు, ఇంతగా అభిమానిస్తున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమానులు చేస్తున్న వేడుకలు చూస్తుంటే తనకు అన్నం కూడా తినబుద్ధి కావడంలేదని, తనపై ఇంత అభిమానం పెట్టుకున్నందుకు జన్మజన్మలకు తాను వారికి రుణపడివుంటానని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

ఆ అభిమానానికి వెలకట్టలేమని, తనలాగే మీరంతా ఈ సినిమాను ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, మీకు భవిష్యత్తులో మరింత వినోదాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు అతి పెద్ద విజయాన్ని కట్టబెట్టారని, అందుకు తాను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని కొరటాల శివ ప్రకటించారు. ఇది తనకు బెస్ట్ ఫిల్మ్ అంటూ అనేకమంది ఫోన్లు చేసి చెబుతున్నారని, అందరూ మెచ్చుకుంటున్నారని కొరటాల శివ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+