ఇతర రాష్ట్రాల్లో 'దేవర' గురించి ఏమంటున్నారో తెలుసా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన మాస్ ర్యాంపేజ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. థియేటర్లతో మాస్ జాతరతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. కొరటాల శివ తన ఎలిమెంట్స్ తో అభిమానులకు పిచ్చెక్కించాడు. ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీరింది. ఈ సినిమా విడుదలైనప్పుడు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ను దడదడలాడిస్తున్న దేవర కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. ఈ సినిమాపై వారేమనుకుంటున్నారో తెలుసుకుందాం.

అదిరిపోయిందంటున్న తమిళులు
ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ గ్లోబల్ హీరోగా మారిపోయారు. బాలీవుడ్ ప్రముఖులంతా తారక్ తో సినిమాలు తీయడానికి ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వార్ 2 లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కు అన్ని భాషల్లో అభిమానులున్నారు. అన్ని భాషల్లో దేవర సినిమాకు మంచి టాక్ వచ్చింది. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ నటనకు, అనిరుధ్ రవిచందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో మొదటిభాగం సూపర్ అంటుంటే ఇతర రాష్ట్రాల్లో మాత్రం రెండో భాగం సూపర్ అంటున్నారు. ముఖ్యంగా తమిళ ఆడియన్స్ దేవరను బాగా ఆదరిస్తున్నారు. పార్ట్-2 మాత్రం అదిరిపోతుందని తమిళ అభిమానులు అంటున్నారు.

junior ntr devara movie got unanimous hit talk in other states

కాలర్ ఎగరేసుకునే ఉందంటున్న కన్నడిగులు
తాము కాలర్ ఎగరేసుకునేలా ఉందంటూ కర్ణాటకలోని తారక్ అభిమానులు రివ్యూలిస్తున్నారు. సినిమా బాగుందని ఏకగ్రీవంగా చెబుతున్నారు. చిన్న చిన్న మైనస్ లు ఉండటం ఏ సినిమాకైనా సహజమంటున్నారు. మళయాళంకు వస్తే ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే చూడాలంటున్నారు. సస్పెన్స్, ట్విస్ట్ లతో దర్శకుడు మెప్పించారంటున్నారు. హిందీలో హిట్ టాక్ వచ్చింది. మొదటిరోజు రూ.7కోట్లు వసూలు చేసింది. పాన్ ఇండియా వ్యాప్తంగా దేవర విజయవంతంగా నడుస్తోందని చెప్పొచ్చు. చివరకు తేలాల్సింది ఏమిటంటే దేవర కలెక్షన్ల లెక్కలే. కొద్దిరోజులు ఆగితే ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి. పాన్ ఇండియా హీరోగా జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏమిటనేది స్పష్టత వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+