రాయలసీమలో తొడగొట్టిన యంగ్ టైగర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని సెప్టెంబరు 27వ తేదీన విడుదల చేయనున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 10కి, అక్కడి నుంచి ముందుకు జరిగి సెప్టెంబరు 27కు వచ్చింది.

ఆరు సంవత్సరాల్లో 2 సినిమాలు
ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబర్ హీరో స్థాయికి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల కాలంలో కేవలం రెండు సినిమాలు చేశారు. 2018లో అరవింద సమేత విడుదలవగా, ఆర్ఆర్ఆర్ 2022లో విడుదలైంది. 2018 నుంచి 2024 సెప్టెంబరు వరకు ఆరు సంవత్సరాలయ్యాయి. సినిమాలు చేసే విషయంలో తారక్ ఎంతో వెనకబడ్డాడని విమర్శలు వస్తున్నాయి. దేవర తర్వాత వార్2 చేస్తున్నాడు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సినిమాలు ఆలస్యంగా చేస్తున్నప్పటికీ రోజురోజుకు తన బిజినెస్ ను మాత్రం పెంచుకుంటూ వస్తున్నాడు.

junior ntr latest movie devara rayalaseema business details here

కల్కిని మించిన బిజినెస్
దేవర చిత్రానికి ప్రస్తుతం బిజినెస్ బాగా జరుగుతోంది. అందులో ప్రధానమైనది రాయలసీమ. రాయలసీమ ప్రాంతంలో దేవర చిత్రం రూ.23 కోట్లకు అమ్ముడు పోయింది. భారీస్థాయిలో రూపొందిన కల్కి కూడా రాయలసీమలో కేవలం రూ.20 కోట్లకే అమ్ముడుపోయింది. ఇంతవరకు ఏ హీరో సినిమా కూడా రాయలసీమలో ఈ స్థాయిలో అమ్ముడుపోలేదు. దీంతో అక్కడ తనకున్న పట్టును తారక్ మరోసారి నిరూపించినట్లైందంటున్నారు. గతంలో విడుదలైన తారక్ సినిమాలు కూడా సీమలో అత్యధిక ధరలకు అమ్ముడుపోయేవి. దీంతో సీమలో ఎవరూ తారక్ ను బీట్ చేయలేరంటూ అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+