జూనియర్ ఎన్టీఆర్ తలుపు తట్టిన అదృష్టదేవత

స్టార్ హీరోలు నటించే భారీ బడ్జెట్ సినిమాలకు సరైన విడుదల తేదీని ఎంచుకోవడం అత్యంత కీలకం. మొదటి వారం వచ్చే కలెక్షన్స్ పై సినిమా ఫలితం ఆధారపడుతుంది. అందుకే భారీగా ఓపెనింగ్స్ వచ్చేటట్లు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తారు. కలిసొచ్చే రోజులను, సెలవులను చూసుకొని సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంగో గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చిత్రం దేవర విషయంలో కూడా నిర్మాతలు ఇలాగే మంచి డేట్ చూశారు.

జనతా గ్యారేజ్ తర్వాత: 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో దేవర రూపొందుతోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం కాబట్టి తారక్ అదిరిపోయే విడుదల తేదీని లాక్ చేశారు. 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. రూపొందుతోన్న మూవీ 'దేవర'.

junior ntr movie devara will release april 5th 2023

తనకు గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చిన 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలున్నాయి. 5న రిలీజ్ డేట్, 6,7 తేదీలు వీకెండ్, 9న ఉగాది, 10న ఈద్, 13,14 తేదీల్లోసెకండ్ వీకెండ్, 17న శ్రీరామ నవమి.. ఇలా మొదటి రెండు వారాల్లో అన్నీ సెలవులు ఎక్కువ ఉండేలా చూసుకొని డేట్ ను చిత్రయూనిట్ లాక్ చేసింది.

ఈ డేట్ ను ఎవరూ వదులుకోరు: ఇంత మంచి విడుదల తేదీని ఎవరూ వదులుకోరారు. అందుకే పెద్ద పెద్ద సినిమాలు ఈ డేట్ పై కన్నేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే తేదీకి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ చిత్రం పరిస్థితి చూస్తే, సినిమా షూటింగ్ పూర్తయితేనే గొప్ప అన్నట్లుగా తయారైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప-2' అన్నారు.

కానీ ఆ సినిమా ఆగస్టు 15వ తేదీకి వెళ్ళిపోయింది. ప్రభాస్ సలార్ అన్నారుకానీ అది ఈ ఏడాది డిసెంబరు 22వ తేదీ అంటున్నారు. ఇంత మంచి తేదీకి ఎటువంటి చిత్రాలు పోటీలోలేవు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ విజృంభిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+