నో డౌట్: 'దేవర'ను నిలబెడుతున్న ఆ ఒక్కటి!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దేవర సినిమా విడుదలైంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ ను ఎలా చూపించాలో అభిమానులకు అలాగే చూపించిన కొరటాల శివతోపాటు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ లా మారింది. మొదటిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే ఎవరూ సినిమా బాగోలేదు అనలేదు. సినిమా మొత్తాన్ని జూనియర్ ఎన్టీఆర్ తన భుజస్కంధాలపై మోశాడు.
అందరికీ కలెక్షన్లు చూసి మతిపోతోంది
రాజమౌళి సెంటిమెంట్ ను కూడా తారక్ బద్ధలు కొట్టాడని చెప్పొచ్చు. రాజమౌళితో చేసిన తర్వాత ఏ సినిమా అయినా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటుంది. కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడా నెగెటివ్ టాక్ మాత్రం తెచ్చుకోలేదు. కొందరికి మొదటి భాగం నచ్చితే మరికొందరికి రెండో భాగం నచ్చింది. కొందరు మాత్రం సినిమా నచ్చలేదంటే మరికొందరు మాత్రం పర్వాలేదు సినిమా చూడొచ్చు అన్నారు. ఇవన్నీ ఇలావుంటే దేవర కలెక్షన్లు చూస్తుంటే అందరికీ మతిపోతోంది. ఎన్టీఆర్ క్రేజ్ చూసి అందరూ అచ్చెరువొందుతున్నారు.

స్టూడెంట్ నెంబర్ వన్ కూడా అంతే
కొన్ని సంవత్సరాల క్రితం తారక్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కూడా సెప్టెంబరు 27వ తేదీనే విడుదలైంది. ఆ సినిమా మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. తర్వాత వారాంతపు సెలవులు కలిసిరావడంతో నెమ్మదిగా పుంజుకొని సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సరిగ్గా దేవర కూడా ఇలాగే అవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కలిసివచ్చే పాయింట్ ఏమిటంటే స్టూడెంట్ నెంబర్ వన్ కు మిక్స్ డ్ టాక్ వచ్చిందికానీ దేవరకు ఎక్కడా నెగెటివ్ టాక్ రాలేదని గుర్తుచేస్తున్నారు. విజయదశమి వరకు ఏ సినిమా కూడా విడుదలవడంలేదు కాబట్టి ఈ సినిమాకు అప్పటివరకు తిరుగులేదంటున్నారు. నెమ్మదిగా పుంజుకొని కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు తరలివస్తారని, సినిమా వెయ్యికోట్ల రూపాయల వసూళ్లవైపు పరుగులు తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.












Click it and Unblock the Notifications