'దేవర' దెబ్బకు ప్రభాస్, మహేష్‌బాబు రికార్డులు గల్లంతు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం దేవర ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. జాన్వీకపూర్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితర సీనియర్ నటులంతా నటించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ దేవర గురించే చర్చ జరుగుతోంది.
మొత్తం 46 షోలు వేస్తున్నారు
ఏ సినిమాకు సంబంధించైనా, ఏ హీరోకైనా ఎన్ని రికార్డులు సాధించినా, నెలకొల్పినా, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రికార్డు నెలకొల్పితే మాత్రం ఆ కిక్కే వేరబ్బా. అలాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో దేవర దెబ్బకు ప్రభాస్, మహేష్ బాబు రికార్డులు గల్లంతయ్యాయి. మొదటిరోజు దేవరకు 46షోలు వేయబోతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న అన్ని థియేటర్లలో ఏడు షోలు వేయనున్నారు. దీనికి సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా నిముషాల్లో అయిపోయాయి. మొత్తం ఏడు షోలమీద 46 షోలు పడుతున్నాయి.

మూడురోజులే సమయం ఉంది
మొదటిరోజు ఇక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ కల్కి నిలిచింది. ఈ సినిమా రూ.87 లక్షలు సాధించింది. రెండోస్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం నిలిచింది. ఈ సినిమా మొదటిరోజు రూ.82 లక్షలు రాబట్టగా, ఆర్ఆర్ఆర్ రూ.76 కోట్లు రాబట్టింది. అయితే దేవరకు ప్రస్తుతం ఉన్న ట్రెండ్, ఆ సినిమాపట్ల ఉన్న మ్యానియా చూస్తుంటే ఈ రికార్డులను బద్ధలు కొట్టడం సులువనిపిస్తోంది. టికెట్లన్నీ అయిపోవడంతో దాదాపుగా మొదటిరోజు ఈ సినిమా రూ.1.25 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మొదటిరోజు ఇంత సాధించడం అంటే చరిత్రలోనే మొదటిసారి అవుతుంది. రూ.1.25 కోట్లు అందుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించినవారవుతారు. అందుకు ఇంకా మూడురోజులే సమయం ఉంది.












Click it and Unblock the Notifications