ఆ క్యారెక్టర్ చేయనందుకు ఇప్పటికీ బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఈ తరం యువనటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే నవరసాలను పూర్తిగా పోషింగలరని చెప్పొచ్చు. నటన పరంగా ఎటువంటి వంక పెట్టడానికి వీలుండదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రదర్శించిన నటనకు దేశ ప్రజలే కాకుండా వివిధ దేశాల్లోనివారంతా ఫిదా అయ్యారు. అంతటి జూనియర్ ఎన్టీఆర్ కు కూడా తీరని కోరిక ఒకటుండి పోయింది. ఆ కోరిక ఏమిటంటే.. శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలని. ఈరోజుకు ఆ పాత్ర పోషించేందుకు అనువైన కథను ఎవరైనా దర్శకుడు, లేదంటే నిర్మాత తీసుకువస్తారేమోనని ఆయన ఎదురుచూస్తూనే ఉన్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా.. ఇలా పౌరాణిక పాత్ర ఏదివేయాలన్నా అందరికళ్ల ముందు మెదిలే రూపం సీనియర్ ఎన్టీఆర్. ఆయన మనవడే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కు కూడా అటువంటి కోరిక మిగిలిపోయిందంటున్నారు. అయితే వివిధ సందర్భాల్లో ఏదైనా చిన్న చిన్న సన్నివేశాల్లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించడంకన్నా పూర్తిస్థాయి పాత్ర పోషించాలని ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా తారక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అన్నీ సాంఘిక చిత్రాలే రూపొందుతున్నాయి. పారాణిక చిత్రాలు రావడంలేదు. ఇవి రావాలంటే బడ్జెట్ భారీగా ఉంటోంది. ఇంత భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలెవరూ ముందుకు రావడంలేదు. రాజమౌళి మహాభారతం తీస్తానంటున్నారుకానీ అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది చూడాలి.

Junior NTR said that he could not play that character

భవిష్యత్తులో కూడా ఏవీ పౌరాణిక చిత్రాలు వచ్చే అవకాశం లేదుకాబట్టి ఆ పాత్ర ఇప్పటికీ తనకు తీరని కోరికగా ఉండిపోయిందని, అది అలాగే ఉండిపోతుందా? లేదంటే ఏదైనా నిర్మాత, దర్శకుడివల్ల కోరిక తీరుతుందేమో చూడాలని తారక్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుంటారు. ఒక్కోసారి ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంటాడని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+