జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో జ్యోతిరాయ్
గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగుతెరకు పరిచయమైంది కన్నడ నటి జ్యోతిరాయ్. జగతీ మేడమ్ గా ఈ సీరియల్ లో ఆమె నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో హీరో హీరోయిన్లకు ఎంత పేరైతే వచ్చిందో అంతపేరు జ్యోతిరాయ్ కు వచ్చింది. ఒకరకంగా ఈ సీరియల్ తో ఆమె జీవితం మంచి టర్న్ తీసుకుంది. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది.
ప్రెట్టీ గర్ల్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఆమె అధికారికంగా తెలిపింది. ఆ సినిమాలో ఆమె అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా ఒప్పుకుంది. ఆమె డైరెక్టర్ పుర్వాజ్ ను రెండో వివాహం చేసుకుంది. ఎన్ని వివాదాలు వచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది.

జ్యోతిరాయ్ లక్కీ ఛాన్స్ పట్టేసిందనే వార్తలు వస్తున్నాయి. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇది ఆయన కెరీర్ లో 31వ సినిమాగా తెరకెక్కుతోంది. సలార్ సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. దాన్ని పూర్తిచేసి ఎన్టీఆర్ 31 ను మొదలుపెట్టబోతున్నారు. ఈ చిత్రంలో జ్యోతి రాయ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. జ్యోతిరాయ్ భర్త పుర్వాజ్, ప్రశాంత్ నీల్ క్లోజ్ ఫ్రెండ్ అని, అతను చెప్పడం వలనే జ్యోతికి అవకాశం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమవుతుంది. దీనికి సమాంతరంగా చేయాలా? లేదంటే మొత్తం షూటింగ్ పూర్తిచేసిన తర్వాత దేవర2 చేయాలా? అనే మీమాంసలో తారక్ ఉన్నాడు.












Click it and Unblock the Notifications