అయ్యో.. అక్కను చూడాలో చెల్లిని చూడాలో అర్థం కావడం లేదే..!
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'లక్ష్మీ కల్యాణం' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన కాజల్ గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినేస్ మ్యాన్‌తో ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు రిలేషన్‌షిప్‌లో కొనసాగించిన కాజల్ అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కాజల్ హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. ఇదే సమయంలో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం రావడంతో కాజల్‌కు అవకాశాలు తగ్గాయి.

ఇక కాజల్ గర్భవతి కావడం, బాబుకు జన్మనివ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీలో నటించింది. కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.ఘాటు అందాల షోతో కుర్రకారును తెగ ఎట్రాక్ట్ చేస్తోంది కాజల్ అగర్వాల్. సెకండ్ ఇన్నింగ్‌లో డోస్ పెంచేసి తన అందచందాలతో మైమరిపిస్తోంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్‌ను పోస్ట్ చేసింది.
తాజాగా తన పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. శనివారం తన చెల్లెలు నిషా అగర్వాల్ పుట్టినరోజు కావడంతో కాజల్ సోషల్ మీడియాలో ఆమెతో దిగిన ఫొటోలనే షేర్ చేసింది.ఇందులో బీచ్ ఒడ్డున అక్కాచెల్లెళ్లిద్దరూ బికినీలో ఉన్న ఫొటోస్ నెటిజన్లను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా చేశాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అక్కను చూడాలో చెల్లిని చూడాలో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications