కాజల్ రూమ్‌లో దూరిన ఆగంతకుడు..చొక్క విప్పి అలా చేయడంతో
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంటూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన కాజల్ గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినేస్ మ్యాన్‌తో ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు రిలేషన్‌షిప్‌లో కొనసాగించిన కాజల్ అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కాజల్ హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. ఇదే సమయంలో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచియం రావడంతో కాజల్‌కు అవకాశాలు తగ్గాయి.

ఇక కాజల్ గర్భవతి కావడం బాబుకు జన్మనివ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీలో నటించింది. కాజల్ ప్రస్తుతం సత్యభామ అనే సినిమాలో నటిస్తోంది. సత్యభామ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. నవీన్ చంద్ర కీలకపాత్ర పోషించాడు. సినిమా మే 31న రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది కాజల్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందులు, సంఘటనలను గుర్తు చేసుకుంది.
ఓ సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో తాను కారవాన్‌లో ఉండగా ఎవరి అనుమతి లేకుండానే గుర్తు తెలియని వ్యక్తి తన కారవాన్‌లోకి వచ్చాడని తెలిపింది. చొక్క విప్పి.. తన ఛాతీపై ఉన్న నా పేరును టాటూని చూపిస్తూ మీకు తాను పెద్ద అభిమానని చెప్పాడని గుర్తుచేసుకుంది. ఎవరు లేని సమయంలో అతడు అలా చేయడంతో తాను భయపడ్డానని.. అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో చూపించినందుకు ఆనందంగా ఉన్నా.. అలా చేయడం కరెక్ట్ కాదని సున్నితంగా హెచ్చరించి పంపించినట్లు చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications