తనకంటే 8 ఏళ్ల చిన్నవాడితో స్టార్ హీరోయిన్ రొమాన్స్..!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. అక్కడ నటనకే ప్రాధాన్యం తప్ప చిన్నా పెద్దా అని తేడాలు ఉండవు. ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో వాళ్లు చేస్తుంటారు. ఏ పాత్ర ఇచ్చినా తమదైన శైలిలో మెప్పించడమే నటీనటుల వంతు. అందుకే చిన్న వయసులోనే చాలా మంది స్టార్స్ తండ్రి పాత్రల్లోనూ నటిస్తుంటారు. అటు హీరోయిన్లు కూడా తల్లి, భార్య పాత్రల్లో మెప్పిస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సహజం. అయితే ఇటీవల రిలీజైన ఓ మూవీలో హీరో కంటే హీరోయిన్ దాదాపు 8 ఏళ్లు పెద్ద. అయినా ఇద్దరూ స్క్రీన్ పై తమ నటన, రొమాన్స్ తో వావ్ అనిపించారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఓ సినిమాలో నటించింది. ఈ మూవీలో మలయాళ స్టార్ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించాడు. ఈ మూవీ పేరు సర్ జమీన్.. కాగా మూవీ తాజాగా ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే నిజ జీవితంలో కాజోల్ కంటే పృథ్వీరాజ్ ఎనిమిది ఏళ్లు చిన్నవాడు. అయినా వీళ్లిద్దరూ భార్యాభర్తలుగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈచిత్రాన్ని జూలై 25న డైరెక్ట్ గా జియో హార్ట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ చేయగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ మూవీకి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించాడు. ఆయన బాలీవుడ్ సీనియర్ నటుడు బొమన్ ఇరానీ కుమారుడు. బోమన్ ఇరానీ తెలుగులో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. బాలీవుడ్ లో పీకే లాంటి చిత్రాల్లోనూ నటించారు. ఇక సర్ జమీన్ చిత్రం ఆర్మీ నేపథ్యంలో సాగుతుంది. అయితే మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ మూవీలో పృథ్వీరాజ్ ఆర్మీ అధికారిగా కనిపించారు. దేశ రక్షణ కోసం కుటుంబాన్ని సైతం లెక్కచేయని ఆర్మీ అధికారిగా పృథ్వీరాజ్ కనిపిస్తారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Kajol and Prithviraj Sukumaran Shine in Sarzameen A Powerful Tale Despite 8-Year Age Gap

ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ 2 లో నటించనున్నారు. ఇటీవల మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ తో ఎల్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీలోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+