థగ్ లైఫ్ కు కొత్త భయం?
Thug Life: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం.. థగ్ లైఫ్. మణిరత్నం దర్శకుడు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చారు. శిలంబరాసన్ టీఆర్, జయం రవి, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి.. ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 300 కోట్ల రూపాయలతో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
విడుదల తేదీ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో బ్యాన్ ను ఎదుర్కొంటోందీ మూవీ. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళం నుంచే కన్నడ జన్మించిందని చెప్పుకొచ్చారు.

ఇది- కన్నడ భాషాభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) ఇటీవల నిర్ణయం తీసుకుంది కూడా. కర్ణాటక చిత్ర పరిశ్రమతో పాటు కొంకణి, తుళు, కొడవ భాషలకు చెందిన చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కూడా.. కేఎఫ్సీసీ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రదర్శించబోమని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, పూర్తి వీడియోను మరుగునపెట్టారని రాజ్ కమల్ ఫిల్మ్స్ తరఫు న్యాయవాది వాదించారు. తమిళనాడు- కర్ణాటక ప్రజల మధ్య ప్రేమ, స్నేహాన్ని వ్యక్తపరచడానికే కమల్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు.
కమల్ వ్యాఖ్యల వల్ల థగ్ లైఫ్ సినిమాపై వ్యతిరేకత ఏర్పడిందని, ఇది వాంఛనీయం కాదని అన్నారు. ఈ చిత్రాన్ని 300 కోట్ల రూపాయలతో నిర్మించామని, కర్ణాటక వంటి అతి పెద్ద మార్కెట్ లో విడుదల కాకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇదివరకు చిత్రం యూనిట్.. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఓ వినతి పత్రాన్ని సైతం సమర్పించారని వివరించారు. దీనిపై కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications