ముసలోడే కానీ..? ఆ విషయంలో మాత్రం..!
కోలీవుడ్ స్టార్ హీరో, లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ'థగ్ లైఫ్' ఈ మూవీ జూన్ 5 న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీకి ఆశించినంత విజయం దక్కలేదు. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్ట్ చేయడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ మూవీ ఎందుకో ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో ఈ మూవీ ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు త్రిష కృష్ణన్, శింబు, మహేష్ మంజ్రేకర్, అభిరామి, నాసర్, అశోక్ సెల్వన్, అలీ ఫజల్.. తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రంలో, 70 ఏళ్ల కమల్ హాసన్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. కానీ మూవీ మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది.
అయితే తాజాగా ఓ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించని చిత్రాలు సైతం ఓటీటీలో మాత్రం సత్తా చాటుతున్నాయి. ఈ ఫార్ములా థగ్ లైఫ్ కూ వర్కౌట్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ వీక్లీ టాప్ 10 లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

అయితే టాప్ 5 వ్యూయర్ షిప్ ఆఫ్ సౌత్ ఇండియన్ మూవీస్ లో మాత్రం చోటు సాధించలేక పోయిందీ మూవీ. ఆఫీసర్ ఆన్ డ్యూటీ, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల కంటే తక్కువ స్థానంలో ఈ మూవీ ఉంది. నెట్‌ఫ్లిక్స్ వీక్లీ డేటా ప్రకారం జూన్ 30 నుంచి జులై 6 వరకు థగ్ లైఫ్ రెండో స్థానంలో కొనసాగింది. ఈ మూవీకి 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాక 6.6 మిలియన్ అవర్స్ ను ఈ మూవీ సాధించింది. ఇక ఫస్ట్ ప్లేస్ లో రైడ్- 2 చిత్రం ఉంది. ఈ మూవీ 4.9 మిలియన్ వ్యూస్ రాబట్టింది.












Click it and Unblock the Notifications