అప్పుడే సినిమాలు వదిలేస్తా.. రిటైర్మెంట్ ఎప్పుడో ప్రకటించిన కమల్ హాసన్ !
లోక నాయకుడు "కమల్ హాసన్" గురించి పరిచయం అక్కర్లేదు. సినీ పరిశ్రమలో ఆల్ టైం బెస్ట్ యాక్టర్స్‌లో ఆయన కూడా ఒకరు అనడంలో సందేహం అక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగు, హిందీ సహా పలు భాషల్లోనూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయ రంగంలోనూ చురుగ్గా కొనసాగుతున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటించిన "నాయకుడు" మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ 38 ఏళ్ల తార్వాత వీరి కాంబినేషన్ లో "థగ్ లైఫ్" అనే చిత్రం రాబోతుంది. ఇందులో కమల్ తో పాటు శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రలు పోషిం చారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుండటంతో, కమల్ హాసన్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో కమలహాసన్ తన రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అప్పుడే రిటైర్మెంట్..
గతంలో "రిటైర్మెంట్ అంటే మరణంతో సమానం" అన్న ఆయన, ఈసారి మాత్రం "ప్రస్తుతం ఉన్న లేదా వచ్చే తరం నటుల్లో ఎవరైనా తనను మించిన నటుడు ఉంటే.. తాను సినిమాలు వదిలేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అభిమానులు కమల్‌ని మించే నటుడు రాడు.. రాలేరు.. ఆయనకు రిటైర్మెంట్ అంటే మరణమే అంటూ స్పందిస్తున్నారు.
మరోవైపు బెంగుళూరులో జరిగిన ఈవెంట్ లో కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టింది అంటూ కమల్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారంపై కన్నడ ప్రజాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సినిమాని బ్యాన్ చేస్తామంటూ ఉద్యమిస్తున్నారు. కర్ణాటక రాజకీయ నేతలు సైతం కమల్ పై మండిపడ్డారు. కానీ కమల్ మాత్రం ప్రేమతోనే అలా మాట్లాడానని.. ప్రేమ ఎప్పుడూ సారీ చెప్పదని అన్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం థగ్ లైఫ్ సినిమా రిలీజ్ లోపు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే అధికారికంగానే సినిమాను బ్యాన్ చేస్తాం అంటూ నోటీసులు ఇచ్చింది.
ఇక బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన కమల్ హాసన్.. మొదటి చిత్రానికే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత నటుడిగా మరో మూడు సార్లు నేషనల్ అవార్డును గెలుచుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, పాటల రచయిత, నృత్య దర్శకుడిగా, మేకప్ ఆర్టిస్ట్ గా కూడా ప్రతిభ చూపించారు. 'మక్కల్ నీది మయ్యం' పార్టీ ద్వారా రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. ఆయన కుమార్తెలు శృతిహాసన్, అక్షరహాసన్ సైతం చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించారు.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి!












Click it and Unblock the Notifications