హత్య జరిగిన తర్వాత హీరో నన్ను చితకబాదేశాడు, పోలీసులకు చెప్పిన నటి పవిత్ర ?

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య తర్వాత కన్నడ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్ తనపై శారీరకంగా కూడా దాడికి పాల్పడ్డాడని హీరో ప్రియురాలు పవిత్రా గౌడ చెప్పిందని పోలీసు వర్గాలు తెలిపాయి. హీరో దర్శన్ మీద అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడ పోలీసులకు ఇలాంటి స్టేమెంట్ ఇవ్వడంతో ఇప్పుడు హీరో అభిమానులు షాక్ అయ్యాని తెలిసింది.

కన్నడ హీరో దర్శన్ గర్ల్ ఫ్రెండ్ నటి పవిత్రా గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడని ఆరోపిస్తూ చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని హత్య చేశారు. రేణుకా స్వామి హత్యకు గురైన తర్వాత ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ కన్నడ నటుడు దర్శన్ అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడపై దాడి చేసినట్లు సమాచారం ఉందని హత్య కేసు దర్యాప్తు చేస్తున్న బెంగళూరు సిటీ పోలీసు అధికారులు తెలిపారు.

Kannada Challenging Star Darshan is also known to have attacked actress Pavitra Gowda

కన్నడ హీరో దర్శన్ చేతిలో దాడికి గురైన అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ సోమవారం బెంగళూరులోని రాజ రాజేశ్వరి నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి ఆమె డిశ్చార్జి అయ్యింది. ఈ అంశాలన్నీ ఇప్పుడు నటుడు దర్శన్‌కి సంబంధించిన హత్య కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. రేణుకా స్వామిని తాను బెదిరించమని చెప్పానని, అతన్ని చంపమని తాను చెప్పలేదని నటుడు దర్శన్ పోలీసులకు చెప్పాడని ఓ పోలీసు అధికారి అన్నారు.

హత్య జరిగిందని తెలుసుకున్న నటుడు దర్శన్ ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ తన మీద శారీరకంగా దాడి చేశాడని, తనను ఇలా మందలించాడని నటి పవిత్రా గౌడ పోలీసులకు సమాచారం ఇచ్చిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. తన మీద భౌతిక దాడి జరిగిందని నటి పవిత్రా గౌడ హీరో దర్శన్ గురించి పోలీసులకు చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరిగిందని పోలీసులు అంటున్నారు.

ఈ విషయం మొత్తం పవిత్రా గౌడ పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. నటుడు దర్శన్ ను బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు విచాణ చేసి వివరాలు సేకరించారు. దీంతో హీరో దర్శన్ ప్రియురాలు పవిత్రా గౌడను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. దర్శన్, పవిత్రలను పోలీసులు క్షుణ్ణంగా విచారించారు. నటుడు దర్శన్‌పై హనీట్రాప్, కిడ్నాప్‌తో పాటు హత్య ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. దర్శన్, పవిత్ర గౌడల విచారణ పూర్తి అయ్యింది. ఈ ఇద్దరితో సహా అరెస్టు అయిన 13 మంది నిందితులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+